Saturday, November 23, 2024

UP: కొన‌సాగుతున్న పోలింగ్ : ఓటు హ‌క్కు వినియోగించుకున్న‌ మాయావ‌తి

యూపీలో 4వ దశ పోలింగ్​ ఉత్తర్‌ప్రదేశ్‌ శాసనసభ ఎన్నికలకు నాలుగో విడత పోలింగ్‌ 7 గంటలకు ప్రారంభమైంది. 9 జిల్లాల పరిధిలోని 59 స్థానాలకు ఓటింగ్‌ జరగనుంది. మొత్తం 624మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లఖ్​నవూలోని మున్సిపల్ నర్సరీ స్కూల్​లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్​లో ఓటేశారు. లఖ్‌నవూ జిల్లాతో పాటు దశాబ్దాల పాటు కాంగ్రెస్‌కు కంచుకోటగా ఉన్న రాయ్‌బరేలీ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోనూ ఈ విడతలోనే.. ఓటింగ్‌ జరగనుంది. జాతీయస్థాయిలో తీవ్ర కలకలం రేపిన లఖింపుర్‌ ఖేరీ ఘటన జరిగిన నియోజకవర్గంలోనూ నాల్గో విడతలోనే ఎన్నికలు జరగనున్నాయి. 2017 అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న 59స్థానాల్లో భాజపా-51, ఎస్పీ-4, బీఎస్పీ-3, అప్నాదళ్‌ ఒకచోట గెలుపొందాయి. ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసిన ఈడీ మాజీ అధికారి రాజేశ్వర్‌సింగ్‌ లఖ్‌నవూ జిల్లా సరోజినీనగర్‌ స్థానం నుంచి భాజపా తరఫున బరిలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement