ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర పరిశ్రమల మంత్రి రాకేష్ సచన్‌కు కాన్పూర్ కోర్టు 1991 ఆర్మ్స్ యాక్ట్ కేసులో ఏడాది జైలు శిక్ష, రూ 1500 జరిమానా విధించింది. రాకేష్ సచన్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. మంత్రి రాకేష్‌ను అక్రమ ఆయుధాల కేసులో కోర్టు శనివారం దోషిగా నిర్ధారించింది. కేసులో మంత్రిని దోషిగా తేల్చి శిక్ష ఖరారు చేయకుముందే ఆయన కోర్టు నుంచి వెళ్లిపోయారు. తాను కోర్టు నుంచి వెళ్లిపోలేదని, ఇవి వదంతులేనని ఆ తర్వాత మంత్రి పేర్కొన్నారు. కొన్ని కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, జరుగుతున్న పరిణామాలు ప్రజలను పక్కదారి పట్టించేలా ఉన్నాయని రాకేష్ సచన్ వ్యాఖ్యానించారు. ఆయన మరోసారి పార్టీ మారి గత యూపీ ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరి గెలిచి మంత్రి అయినా.. గతంలో చేసిన తప్పుల వల్ల ఆయనకు జైలుశిక్ష పడింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement