నిన్న వెలువడిన ఎన్నికల ఫలితాల్లో భారీ మెజార్టీ సాధించిన ఉత్తర్ ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాధ్ ఈరోజు ఢిల్లీకి రానున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత తొలిసారి ఢిల్లీకి వస్తున్నారు. ఢిల్లీలో ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ పెద్దలను ఆయన కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటు పై చర్చించనున్నారు. ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ రెండోసారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. యోగి ఆదిత్యానాధ్ ఒంటిచేత్తో యూపీని గెలిపించి గతంలో ఉన్న రికార్డులను బ్రేక్ చేశారు. యోగి ఆదిత్యానాధ్ ఢిల్లీ పర్యటనలో ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గం తదితర అంశాలపై చర్చించనున్నారు. ముఖ్యమంత్రిగా తన రెండోసారి ప్రమాణస్వీకారానికి మోదీ, అమిత్ షాలతో సహా యూపీ ప్రచారంలో పాల్గొన్న కేంద్ర మంత్రులను యోగి స్వయంగా ఆహ్వానించనున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
#AndhraPrabha #AndhraPrabhaDigital