అకాల వర్షాలతో స్కూల్స్ ..కాలేజీలకు సెలవు ప్రకటించింది తమిళనాడు ప్రభుత్వం. అల్పపీడన ప్రభావంతో సముద్ర తీర జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో నాగపట్టినం, తిరువరూర్ జిల్లాల్లో అధికారులు పాఠశాలలు, కాలేజీలకు సెలవు ప్రకటించారు. కాగా, నైరుతి బంగాళాఖాతంలో శ్రీలంకలోని బట్టికలోవాకు 60 కిలోమీటర్ల దూరంలో, తమిళనాడులోని కరైకల్‌కు 400 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నదని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఇది గురువారం తీరందాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ప్రభావంతో దక్షిణ తమిళనాడులోని చాలా ప్రాంతాల్లో సాధారణం నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెన్నైలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement