కొచ్చిన్ యూనివర్సిటీ, కేరళ హెల్త్ సైన్సెన్ వర్సిటీల్లోనూ మెటర్నిటీ లీవ్ ని ప్రకటించారు. వర్సిటీలో చదువుతున్న విద్యార్థినులు ఆరు నెలల దాకా మెటర్నిటీ లీవ్ తీసుకోవచ్చని తెలిపింది. ఈ సౌకర్యం పద్దెనిమిదేళ్లు నిండిన విద్యార్థినులకేనని స్పష్టం చేసింది. ఈ సెలవులు పూర్తయిన తర్వాత నేరుగా క్లాసులకు హాజరు కావొచ్చని, మరోమారు అడ్మిషన్ తీసుకోవాల్సిన అవసరంలేదని స్సష్టం చేసింది. సంబంధిత అధికారులు విద్యార్థినులు తీసుకున్న లీవ్, మెడికల్ రిపోర్టులు పరిశీలించి క్లాసులకు అనుమతిస్తారని పేర్కొంది. ఈమేరకు యూనివర్సిటీ ఆఫ్ కేరళ ఉత్తర్వులు జారీ చేసింది. కిందటి వారం కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. 60 రోజుల పాటు సెలవు తీసుకోవచ్చని తెలిపింది. రాష్ట్రంలో విద్యార్థినులకు మెటర్నిటీ లీవ్ ప్రకటించిన తొలి యూనివర్సిటీ ఇదేనని అధికారులు తెలిపారు. అదేవిధంగా కేరళ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ కూడా విద్యార్థినులకు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవ్ తీసుకునే సదుపాయం కల్పించాయి.
విద్యార్థినులకు ఆరు నెలల పాటు మెటర్నిటీ లీవ్..ప్రకటించిన యూనివర్సిటీ ఆఫ్ కేరళ
Advertisement
తాజా వార్తలు
Advertisement