Friday, November 22, 2024

తెలంగాణ‌లో విశ్వ వివాదాల‌యం…

ఉమ్మడి నిజామాబాద్‌, ప్రభన్యూస్‌ బ్యూరో: తెలం గాణ విశ్వవిద్యాలయం వివాదాలకు నిలయంగా మారింది. నిజామాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలో ఉన్నత ప్రమాణాలతో నెలకొల్పిన తెలంగాణ యూనివర్సిటీ ప్రతిష్ట నానాటికి దిగజారి పోతుంది. వివాదాలు, సమ స్యల మధ్య విద్యార్థులు, ఉద్యోగులు నలిగిపోతున్నా రు. సమస్యలను పరిష్కరిం చాల్సిన పాలకమండలి, వైస్‌ ఛాన్సలర్‌ల మధ్య వివాదాలే అసలు సమస్యగా మారాయి. అనేక ఏళ్లుగా కొనసాగుతున్న వివాదాల పరిష్కారానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. విశ్వవిద్యాలయం స్థాయి దిగజారే విషమ పరిస్థితులు నెలకొన్నాయి. ఇటీవల పాలకమండలి ఆమోదం లేకుండా, ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌కు సమా చారం లేకుండా రిజిస్ట్రార్‌ను మార్చడం కొత్త వివాదానికి తెరలేపింది. దీనిపై పాలక మండలి, నవీన్‌ మిట్టల్‌ ఆగ్ర#హం వ్యక్తం చేశారు. శుక్రవారం జరిగిన పాల కమండలి సమావేశంలో వీసీ రవీందర్‌ గుప్తాపై చర్యలకు డిమాండ్‌ చేస్తూ తీర్మానం చేశారు. అయితే ఈ మేరకు వీసీపై చర్యలు ఉంటా యి అనేది సంశయంగా మారింది. గతంలో వీసీ అక్ర మాలపై అనేక ఫిర్యాదులు, ఆందోళనలు చేపట్టారు. జిల్లా మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి దృష్టికి తీసుకె ళ్లారు. కొన్ని నిబంధనల ప్రకారంగా వీసీ తనకేమీ కాదనే ధీమాలో ఎవరినీ లెక్కచేయడం లేదన్నది చర్చనీయాంశం గా మారింది. దాదాపు మూడేళ్ళుగా వీసీ రవీందర్‌ గుప్తాపై అనేక అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. అయితే బుధవారం రోజున తెలంగాణ యూనివర్శిటీ రిజిస్ట్రార్‌గా ప్రొఫెసర్‌ యాదగిరి స్థానంలో ఓయూ ఈసీఈ హడ్‌ నిర్మలాదేవిని నియమిస్తూ వీసీ ఆదేశాలు జారీ చేశారు. దీంతో #హుటాహుటిన తెయూ రిజిస్ట్రార్‌గా నిర్మలాదేవి బాధ్యతలు తీసుకున్నారు. వెంటనే అదేరోజు సాయత్రం రిలీవ్‌ ఆర్డర్‌ రద్దు చేస్తూ తిరిగి ఓయూలో చేరాలని ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో రిజిస్ట్రార్‌ నియామకంపై #హడ్రామా కొనసాగింది. వీసీ ఏకపక్ష నిర్ణయంతో పాలకమండలి, ఉన్నత విద్య శాఖ రగిలిపోయింది. ఇదిలా ఉంటే ఇప్పటికే వీసీ రవీందర్‌ గుప్తా, ఉన్నత విద్య కమిషనర్‌ నవీన్‌ మిట్టల్‌ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరుకున్నాయి. వీసీ అక్రమాలపై #హకోర్టులో వేసిన కేసు రవీందర్‌కు అనుకూలంగా రావడంతో ఏకంగా నవీన్‌ మిట్టల్‌పై రెచ్చిపోయాడు. వ్యతిరేకంగా బాహాటంగానే నవీన్‌ మిట్టల్‌పై వీసీ ఆరోపణలు చేయడం తీవ్ర దుమారం రేపింది.

వీసీని వివాదాల్లోకి నెట్టింది ఇవే..
ఆది నుంచి వీసీ వివాదాలకు కేంద్ర బిందువుగా మారడం, ఎవరినీ లెక్కచేయనితనం సమస్యలను మరింత జటిలం చేసింది. నిజమాబాద్‌ జిల్లా డిచ్‌పల్లిలోని తెలంగాణ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా రవీందర్‌ గుప్తా బాధ్యతలు చేపట్టిన తర్వాత వివాదాల దుమారం రేగింది. రవీంద్ర గుప్తా వ్యవహారం యూనివర్సిటీలో సమస్యలకు కారణమైంది. విద్యార్థి సంఘాలు, పాలకమండలి సభ్యులు వీసీ తీరుపై అనేకసార్లు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ ఏమాత్రం పట్టించుకోని వీసీ తనదైన శైలిలో విశ్వవిద్యాలయంలో ఏకచత్రాధిపత్యాన్ని కొనసాగించారు. నిబంధనలకు విరుద్ధంగా 140 మందికి పైగా నియామకాలు చేపట్టడం తీవ్ర దుమారం రేపింది. ఈ వ్యవహారంలో లక్షల రూపాయలు చేతులు మారినట్లుగా ఆరోపణలు వ్యక్తమయ్యాయి. ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు కూడా ప్రమోషన్లు ఇస్తానని డబ్బులు వసూలు చేసినట్లుగా విద్యార్థి సంఘాలు ఆరోపించాయి. 2014 రెగ్యులర్‌ బోధన సిబ్బందికి ప్రమోషన్ల వ్యవహారంలో డబ్బులు భారీగా తీసుకుని వీసీ అక్రమాలకు పాల్పడినట్లుగా ఆరోపణ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఉద్యోగుల పేరున అడ్వాన్స్‌ డబ్బులను రూ. లక్షల్లో తీసుకొని వాడుకున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిలా ఉంటే ఏమాత్రం కూడా పాలక మండలి సభ్యుల సలహాలు, సూచనలను లెక్కచేయకుండా వీసీ ఏకపక్ష నిర్ణయాలు తీసుకున్నారన్న అపవాద ఉంది.

తెయూలో విశాలమైన సమావేశ మందిరాలు ఉన్నపటికీ ప్రైవేట్‌ హోటళ్లలో సెమినార్లు నిర్వ#హంచి లక్షల్లో డబ్బులు వృధా చేసారని అపవాదు మూటగట్టుకున్నారు. యూనివర్సిటీలో ఏవైనా సామాగ్రి కొనుగోలు, మరమ్మత్తులు, ఇతర వ్యవహారాల్లో రూ.5 లక్షల లోపు ఖర్చు చేసుకునే అధికారం ఉపకులపతికి ఉంటుంది. ఇదే అదనుగా పాలకమండలి అనుమతి లేకుండా లక్షల రూపాయలు ఇష్టారాజ్యంగా ఖర్చు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వీటిపై పాలకమండలి కూడా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. దీంతో విశ్వవిద్యాలయం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు జరగని నిధుల కొరత తీవ్రమైంది. ఇలాంటి ఆరోపణలు అనేకం ఉండగా ఓ పండుగ సందర్భంగా మ#హళ వసతి గృహాల్లోకి రాత్రివేళ వెళ్లిన వీసీ రవీందర్‌ గుప్తా డబ్బులు వెదజల్లి నృత్యాలు చేసిన వీడియోలు వైరల్‌ అయ్యాయి. దీంతో పాటుగా ఉద్యోగుల వేధింపులు కూడా వీసీ మెడకు చుట్టుకున్నాయి. ఇలా అనేక అవినీతి, అక్రమాల ఆరోపణలు వీసీ రవీందర్‌ గుప్తాపై ఉన్నాయి.

వీసీపై తీర్మానాలతో ప్రభావం చూపేనా?
వీసీ రవీందర్‌ గుప్తా వర్సెస్‌ ఈసీ మధ్య పోరు పతాకస్థాయికి చేరింది. ఇప్పటికే వీసీ ఏకపక్ష నిర్ణయాలతో ఆగ్ర#హంతో ఉన్న పాలకమండలి మొన్న #హదరాబాద్‌లో జరిగిన కీలక సమావేశంలో వీసీ రవీందర్‌ గుప్తాపై చర్యలకు తీర్మానాలు చేశారు. ఏసీబీ, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేశారు. వీరితో పాటు ముగ్గురు రిజిస్ట్రార్లపై క్రిమినల్‌ కేసులకు ప్రభుత్వానికి నివేదించారు. అయితే వీసీపై చర్యలు ఎంత మేర చేపడతారనేది చర్చనీయాంశంగా మారింది. ప్రభుత్వం కూడా వీసీ విషయంలో అత్యంత సీరియస్‌గానే ఉన్నప్పటి వీసీని తొలగించడానికి నిబంధనలు అడ్డొస్తున్నాయి. ఏకంగా నవీన్‌ మిట్టల్‌ పై నోరు పారేసుకుంటున్నా ఏమి జరగకపోవడంపై తీర్మానాలు ప్రభావం చూపవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

- Advertisement -

వీసీపై చర్యలు చేపట్టే అధికారం పూర్తిగా గవర్నర్‌ పరిధిలో ఉంటుంది. ప్రభుత్వం సిఫారసు మేరకు గవర్నర్‌ వీసీ మార్పు చేపడతారు. ప్రస్తుతం ప్రభుత్వానికి గవర్నర్‌కు మధ్య సత్సంబంధాలు లేకపోవడంతో ఇదే అదనుగా వీసీ రెచ్చిపోతున్నాడనే చర్చ జరుగుతోంది. సుమారు రెండేళ్లుగా వీసీపై విద్యార్థి సంఘాలు, పాలకమండలి అనేకసార్లు ఫిర్యాదులు ఆందోళనలు చేపట్టినా వీసీకి చీమ కుట్టినట్లుగా కూడా లేదు. ఎన్ని వివాదాలు చుట్టుముట్టినా తన పని తాను చేసుకుపోవడం ప్రభుత్వానికి ఆగ్ర హం తెప్పిస్తోంది. జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు హచ్చరించినా వీసీ తీరు మారకపోవడం గమనార్హం. ఏసీబీ, విజిలెన్స్‌కు ఫిర్యాదు చేసినా జంకకుండా తేలికగా తీసుకోవడం, యధావిధిగా కొత్తగా బాధ్యతలు చేపట్టిన రిజిస్ట్రార్‌ ను వెనక్కి రావాలని ఓయూ ఉత్తర్వులు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. ఇదే క్రమంలో ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు వేతనాలు రాకపోవడంతో 240 మంది శనివారం తెయూ ప్రధాన కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. అయితే రిజిస్ట్రార్‌ ఎవరో తెలువకపోవడంతో డబ్బులు వేయలేదని బ్యాంక్‌ అధికారులు తేల్చారు. ఈ రగడ ఇంకా కొనసాగుతూనేఉంది. ఇంత జరిగినా వీసీ ఏమాత్రం తగ్గకపోవడం వివాదానికి మరింత ఆజ్యంపోస్తున్నట్లుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement