Tuesday, November 26, 2024

Telangana: ఐక్య‌రాజ్య‌స‌మితి సుస్థిర అభివృద్ధి.. విద్యార్థుల‌కు పాఠం బోధించిన హిమాన్షు

మంత్రి కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షు విద్యార్థి దశ నుంచే లీడర్​ షిప్​ క్వాలిటీస్​ని చూపుతున్నాడు. ఈ మ‌ధ్య హిమాన్షు ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికల్లో గెలుపొందారు. క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) విభాగానికి అధ్యక్షుడు కూడా అయ్యాడు. హిమాన్షు సామాజిక సేవలోనూ ముందున్న‌ట్టు తెలుస్తోంది. బ్రిటన్ కు చెందిన తెస్సీ ఓజో సీబీఈ సంస్థ హిమాన్షుకు డయానా ఇంటర్నేషనల్ అవార్డును కూడా అందించింది.

కాగా, ఇవ్వాల హిమాన్షు ఉపాధ్యాయుడి అవతారం ఎత్తాడు. ఖాజాగూడ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు సుస్థిర అభివృద్ధి, ప్రగతి లక్ష్యాలు అనే సబ్జెక్టుపై పాఠాలు చెప్పాడు. దీనిపై హిమాన్షు తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా ప‌లు వివ‌రాలు వెల్లడించాడు.
“శనివారం కూడా పనిచేయాలంటే విసుగొస్తుందని ఎవరు చెప్పారు? ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి కార్యాచరణను పిల్లలకు వివరించే అవకాశం వచ్చింది” అని త‌న ట్విట్ట‌ర్‌లో తెలిపాడు. ఈ కార్యక్రమం ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో జరిగింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement