Saturday, November 23, 2024

ఉక్రెయిన్ నుండి 10మిలియ‌న్ ల జ‌నాభా వ‌ల‌స వెళ్లి ఉంటార‌న్న ‘ఐరాస‌’

సుమారు 10మిలియ‌న్ జ‌నాభా ఉక్రెయిన్ నుండి వ‌ల‌స వెళ్లి ఉంటార‌ని UNO అంచనా వేసింది. కొన్ని కుటుంబాలు సెంట్రల్ బుడా‌ఫెస్ట్‌లోని న్యుగటి రైల్వే స్టేషన్ గుండా సరిహద్దులకు చేరుకొంటున్నారు. ఇక్కడ స్వచ్ఛంద సేవా సంస్థలు ఆహారం, వస్తువులను వలసదారులకు సరఫరా చేస్తున్నారు. మరో వైపు మరికొందరు శరణార్ధులు జకర్‌పట్టియా ఒబ్లాస్ట్ నుండి తూర్పు ఉక్రెయిన్‌లోని సరిహద్దు గుండా వలస వెళ్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నల్ల సముద్రంలోని ఓడరేవు నగరమైన ఒడెస్సా నుండి కూడా కూడ కొందరు ఇతర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని యూఎన్ఐ ప్రకటించింది. గత నెల 24వ తేదీన ఉక్రెయిన్ పై రష్యా మిలటరీ ఆపరేషన్ ను ప్రారంభించింది. అయితే ఈ నెల 5వ తేదీ నుండి ఉక్రెయిన్ పై రష్యా కాల్పుల విరమణను ప్రకటించింది. ఈ రెండు దేశాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. ఉక్రెయిన్ పై మిలటరీ ఆపరేషన్ ప్రారంభించిన రష్యాపై పలు దేశాలు ఆంక్షలను విధించాయి. దీంతో రష్యా భవిష్యత్తులో తీవ్రంగా ఇబ్బందులు పడే అవకాశం లేకపోలేదని నిపుణులు భావిస్తున్నారు. USA సెనేటర్లతో సమావేశం సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ కీలక విన్నపం చేశారు. రష్యన్ చమురుపై నిషేధం విధించాలని కోరారు. రష్యా సైన్యం ఉక్రెయిన్ ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement