పోచంపల్లి చీరలు ఎంతో ప్రత్యేకమైనవి..ఈ చీరలకి ఎంతో గుర్తింపు ఉంది. పోచంపల్లి చీరలు ఓ బ్రాండ్ అనే చెప్పాలి. ఈ చీరలు దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపుని తెచ్చుకున్నాయి. అందుకే ఈ పోచంపల్లి సిల్క్ సిటీగా గుర్తింపు పొందింది. ఇప్పుడా గ్రామం గుర్తింపు అంతర్జాతీయ స్థాయికి విస్తరించింది. తాజాగా పోచంపల్లి గ్రామాన్ని ఐక్యరాజ్యసమితి అత్యుత్తమ పర్యాటక గ్రామంగా గుర్తించింది. ఐక్యరాజ్యసమితికి చెందిన వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ ఈ మేరకు ఓ ప్రకటన చేసింది. వచ్చే నెల 2న స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ నగరంలో జరిగే ఐరాస వరల్డ్ టూరిజం 24వ మహాసభల్లో ఈ ప్రతిష్ఠాత్మక అవార్డును ప్రదానం చేయనున్నారు. భారత్ నుంచి ఈ అవార్డుకు మూడు గ్రామాలు రేసులో నిలిచాయి. అయితే సిల్క్ సిటీ పోచంపల్లి మిగతా గ్రామాలను వెనక్కి నెట్టి అరుదైన పురస్కారం సొంతం చేసుకోవడం విశేషం.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..
https://twitter.com/AndhraPrabhaApp, https://www.facebook.com/andhraprabhanewsdaily