ప్రతి వేడుకకి అందరికంటే అందంగా రెడీ అవ్వాలనుకుంటారు ప్రతీ మహిళ.కాగా అమ్మాయిలకు మరింత అందాన్ని తీసుకొచ్చేదీ అలంకరణే. దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇటలీకి చెందిన బ్రైడల్ డిజైనర్ మిచెలా ఫెర్రిరో ఏకంగా 50 వేల క్రిస్టల్స్‌తో ప్రత్యేకంగా వెడ్డింగ్ గౌనును డిజైన్ చేశారు. ఈ గౌను డిజైన్ చేసేందుకు ఏకంగా 50,890 క్రిస్టల్స్‌ను వినియోగించారు. దీని తయారీకి నాలుగు నెలల సమయం పట్టినట్లు డిజైనర్ మిచెలా ఫెర్రిరో తెలిపారు. ఈ ప్రత్యేకమైన గౌనును ఏప్రిల్ 14న మిలాన్ లో జరిగిన ఓ ఫ్యాషన్ షోలో ప్రదర్శించారు.ప్రస్తుతం ఈ ఆకర్షణీయమైన గౌను గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు గౌను ప్రదర్శనకు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. గతంలో టర్కీకి చెందని డిజైనర్ 45,024 క్రిస్టల్‌తో వెడ్డింగ్ గౌనును డిజైన్ చేసి రికార్డు కెక్కారు. ఆ ప్రత్యేమైన గౌనును ఇస్తాంబుల్ 2011 జనవరి 29న ప్రదర్శించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement