Tuesday, November 26, 2024

కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌యిన ఉద్యోగ‌సంఘాలు .. డిమాండ్స్ నెర‌వేర్చాల్సిందే ..

ఏపీ ప్ర‌భుత్వ ఉద్యోగులు స‌మ‌స్య‌ల ప‌రిష్కారం కోసం ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ‌కు సిద్ధ‌మ‌య్యారు. రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి స‌మీర్ శ‌ర్మ‌కు ఉద్య‌మ కార్యాచ‌ర‌ణ నోటీసుని అంద‌జేశారు. సీఎస్ స‌మీర శ‌ర్మ‌కి నోటీసులు ఇచ్చిన వారిలో ఏపీ జేఏసీ , ఏపీ జేఏసీ అమ‌రావ‌తి ఐక్య వేదిక నేత‌లు బొప్ప‌రాజు, బండి శ్రీనివాసులు ఉన్నారు. ఈ నెల 7వ తేదీ నుంచి ఉద్యమ కార్యాచరణను అమలు చేస్తామని ఉద్యోగ సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. తమ న్యాయపరమైన డిమాండ్లను, సమస్యలను ప్రభుత్వం పరిష్కరించేంత వరకు వివిధ రూపాల్లో ఉద్యోగులు నిరసన వ్యక్తం చేయనున్నారు. ఉద్యోగుల డిమాండ్లలో 11వ పీఆర్సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, సీపీఎస్ రద్దు, కాంట్రాక్ట్ గ్రామ సచివాలయ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, ఉద్యోగుల లోన్స్, అడ్వాన్సుల చెల్లింపు తదితర అంశాలు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగ సంఘాలు నిరసనలు, ర్యాలీలు, ధర్నాలు సహా విశాఖ, తిరుపతి, ఏలూరు, ఒంగోలు నగరాల్లో డివిజన్ స్థాయి సదస్సులు నిర్వహించనున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement