Sunday, November 24, 2024

Breaking : ఉక్రెయిన్‌ నుంచి భారత్‌కు తిరిగి వచ్చిన విద్యార్థులకు ప్ర‌త్యేక స్వాగ‌తం ప‌లికిన ‘స్మృతి ఇరానీ’

నిరంత‌రం ఉక్రెయిన్ రాజ‌ధాని కీవ్ పై ర‌ష్యా బాంబులు వేసి క్షిప‌ణుల‌ను ప్ర‌యోగిస్తోంది. ఖేర్స‌న్ న‌గ‌రాన్ని స్వాధీనం చేసుకుంది ర‌ష్యా. కాగా ఉక్రెయిన్-రష్యా మధ్య రెండో రౌండ్ సమావేశం నేడు జరగనుంది. ఈ స‌మావేశంలో ఏదో ఒక పరిష్కారం దొరుకుతుందన్న ఆశాభావం వ్యక్తం అవుతోంది. కాగా ఉక్రెయిన్ నుంచి ఢిల్లీకి తిరిగి వచ్చిన భారత పౌరులకు..కేంద్ర మంత్రి  స్మృతి ఇరానీ స్వాగతం పలికారు. ఆపరేషన్ గంగా కింద ఉక్రెయిన్ నుండి భారతీయ పౌరులను ఖాళీ చేయిస్తున్నారు. ఈ మేర‌కు ఆమె నాలుగు భాష‌ల్లో మాట్లాడుతూ..విద్యార్థుల‌కు స్వాగ‌తం ప‌ల‌క‌డం విశేషం.క్షేమంగా భార‌త్ కి చేరుకున్న విద్యార్థుల‌ను ప్ర‌త్యేకంగా స్వాగ‌తం ప‌లికారు. ఉక్రెయిన్‌లో రష్యా సైన్యానికి గట్టి పోటీ ఇస్తూ సైన్యం, సామాన్యులు ధైర్యం చూపిస్తున్నారు.
Advertisement

తాజా వార్తలు

Advertisement