కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి పెట్రో ధరల పెంపు సెగ తగిలింది. ఆమె ఢిల్లీ- గౌహతి విమానం ఎక్కిన సమయంలో కాంగ్రెస్ మహిళా నేత నెట్టా డిసౌజా కేంద్రమంత్రిని నిలదీశారు. ఈ ఇద్దరి మధ్యా జరుగుతున్న వివాదాన్ని కేంద్ర మంత్రి స్మృతి తన ఫోన్‌లో రికార్డు చేశారు. దీంతో కాంగ్రెస్ మహిళా నేత నెట్టా డిసౌజా కూడా ఈ విషయాన్ని తన ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు. ‘‘గౌహతి వెళ్తున్న సమయంలో మోదీ కేబినెట్‌లో మంత్రిగా ఉన్న స్మృతి ఇరానీ కలిశారు. పెట్రో ధరల పెంపు పై ప్రశ్నించాను. దీంతో వ్యాక్సిన్లు, రేషన్‌తో సహా పేదలను నిందించారు. ఈ వీడియోను చూడండి’’ అంటూ కాంగ్రెస్ నేత డిసౌజా ట్వీట్‌లో పేర్కొన్నారు.
అయితే విమానం దిగుతుండగా ఈ మాటల యుద్ధం సాగింది. అయితే.. పోరాకుండా కాంగ్రెస్ మధ్యలో నిల్చున్నారని ఇరానీ ఆరోపించారు. ఈ సమయంలోనే కాంగ్రెస్ పెట్రో ఉత్పత్తుల ధరల పెంపు గురించి ప్రస్తావించగా.. అదంతా తప్పే అంటూ స్మృతి ఇరానీ చెప్పుకొచ్చారు. దయచేసి అబద్ధాలు ఆడకండి అంటూ కేంద్ర మంత్రి అన్నారని కాంగ్రెస్ నేత డిసౌజా చెప్పుకొచ్చారు.