కేంద్రమంత్రి స్మృతి ఇరానీ డ్యాన్స్ చేశారు. మణిపూర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె అక్కడి ప్రజలతో సంప్రదాయ నృత్యాన్ని చేశారు. ఇంఫాల్ ఈస్ట్‌లోని వాంగ్‌ఖీ ప్రాంతంలో జరిగిన కార్యక్రమంలో డ్యాన్స్ చేశారు. కళాకారులకు అనుగుణంగా స్పెప్పులేశారు. ఈ వీడియో ప్రస్తుతం హల్చల్ చేస్తోంది. గతంలో కూడా కేంద్రమంత్రి కిరణ్ రిజిజు కూడా ఇలాగే స్టెప్పులేశారు. అరుణాచల్ ప్రదేశ్ లో అక్కడి ప్రజలతో కలిసి చిందేశారు. అప్పట్లో ఈ వీడియో వైరల్ గా మారింది. ప్రధాన మంత్రి.. కూడా కిరణ్ రిజిజు డ్యాన్స్ పై ప్రశంసలు కురిపించారు. ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. బిజెపికి ఈ ఎన్నికలు కీలకంగా మారాయి. కాగా మణిపూర్,ఉత్తరాఖండ్,పంజాబ్,గోవా,ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాల్లో గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్, బీజేపీ, అకాలీదళ్, ఎస్పీ పార్టీలు పనిచేస్తున్నాయి. నాయకులు ప్రజల్ని ఆకట్టుకునే పని చేస్తున్నారు. అక్కడి ఆయా రాష్ట్రాల కల్చర్ కి అనుగుణంగా ప్రజల్లో కలిసిపోయేందుకు ఓట్లు పొందేందుకు ప్రయత్నిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..