కేంద్రమంత్రి అబద్ధాలతో పార్లమెంట్‌ను తప్పుదోవ పట్టించారని మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. కేంద్రమంత్రిపై లోక్‌సభలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టాలన్నారు. మన్సూక్ మాండవీయ చెప్పిన అబద్ధంతో తెలంగాణ ప్రజలు అయోమయానికి గురయ్యారని, వారి హృదయాన్ని గాయపరిచారని మండిపడ్డారు. ప్రజలను, దేశాన్ని తప్పుదోవ పట్టించినందుకు తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
బల్క్ డ్రగ్ పార్క్ ఇవ్వకుండా దేశానికి తీరని అన్యాయం చేశారని, రాజకీయాల కోసమే బీజేపీ ప్రాధాన్యం ఇస్తుందని మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. ఇదిలా ఉండగా.. లోక్‌సభ సమావేశాల్లో ఓ ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్‌తోపాటు హైదరాబాద్‌కు బల్క్‌డ్రగ్స్ పార్క్‌లను మంజూరు చేసిందని, ఇందుకు రూ.1,000 కోట్లు అవసరమని అంచనా వేశామని, తొలి విడతలో ఒక్కొక్కదానికి రూ.300 కోట్ల చొప్పున విడుదల చేస్తామని శుక్రవారం లోక్‌సభలో తెలిపిన మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అయితే, లిఖితపూర్వక సమాధానంలో మాత్రం గుజరాత్, హిమాచల్‌ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు బల్క్‌డ్రగ్ పార్క్‌ను మంజూరు చేసినట్టు పేర్కొన్నారు. కేంద్రం ఆడుతున్న అబద్ధాలు, రెండు నాల్కల ధోరణిపై తెలంగాణ సమాజం ఆగ్రహం వ్యక్తం చేస్తోందన్నారు.