Tuesday, November 26, 2024

రోడ్ల దుస్థితి.. ప్రజలకి క్షమాపణలు చెప్పిన కేంద్రమంత్రి గడ్కరీ

కేంద్ర రోడ్డు రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరీ మధ్యప్రదేశ్ ప్రజలకి క్షమాపణలు చెప్పారు. మధ్యప్రదేశ్‌లో రోడ్ల పరిస్థితిపై నితిన్ గడ్కరీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం నాడు మండల, జబల్‌పూర్‌లో నూతనంగా నిర్మించిన రోడ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడుతూ.. మధ్యప్రదేశ్‌లోని రహదారుల గురించి ప్రస్తావించారు. ఇందులో మండల-జబల్‌పూర్‌ హైవే గురించి చర్చిస్తూ.. హైవే నిర్మాణంలో నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు కలిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. అతి త్వరలో కొత్త టెండర్లు వేయాలని, ఆ రోడ్డు నిర్మాణ పనులను మరింత మెరుగు పరచాలని అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా రోడ్ల అభివృద్ధే దేశాభివృద్ధిగా అభివర్ణించారు. తప్పు జరిగితే.. దానికి క్షమాపణ కూడా చెప్పాలని అన్నారు. కొత్త టెండర్‌ వేసి, ఆ రోడ్డును త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement