ఇకపై సైనికుల అనాథ పిల్లలకు నెలకి రూ.3వేలు అందజేయనున్నట్లు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ వెల్లడించారు. ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున లభించేది. ఇకపై రూ. 3 వేల చెప్పున అందజేస్తారు. రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాల పట్ల మానవతా దృక్పథంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. పెంచిన సాయంతో అనాథ పిల్లలు గౌరవప్రదంగా మెరుగైన జీవితాన్ని జీవించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఈ సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తారు. 21 సంవత్సరాల లోపు వయసున్న అవివాహిత కుమార్తె, కుమారుడు ఈ పథకానికి అర్హులు.
Advertisement
తాజా వార్తలు
Advertisement