Thursday, November 21, 2024

వ్య‌వ‌సాయంపై ప్ర‌ధాని మోడీ క‌మిటీ..అదేంటో తెలుసా ..

వ్య‌వ‌సాయంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఒక క‌మిటీని ఏర్పాటు చేశారని కేంద్ర వ్య‌వ‌సాయ‌శాఖ మంత్రి న‌రేంద్ర‌సింగ్ తోమ‌ర్ తెలిపారు. ఈ చ‌ర్య‌తో రైతుల క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర డిమాండ్ కూడా నెర‌వేరిందన్నారు. మూడు వ్య‌వ‌సాయ చ‌ట్టాల ర‌ద్దు ప్ర‌క‌ట‌న త‌ర్వాత కూడా రైతులు ఆందోళ‌న‌ని కొన‌సాగించ‌డం భావ్యం కాద‌న్నారు. నిరసన సమయంలో నమోదైన కేసుల అంశం రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలోనిది.. వారు నిర్ణయం తీసుకుంటారు. రాష్ట్ర ప్రభుత్వాలు తమ విధానం ప్రకారం పరిహారం విషయంలో కూడా నిర్ణయం తీసుకోవచ్చ‌ని కేంద్ర మంత్రి వెల్ల‌డించారు. రైతులు పంట వ్య‌ర్థాల్ని త‌గ‌ల‌బెట్ట‌డం నేరం కాద‌ని కేంద్రం అంగీక‌రించిద‌ని వెల్ల‌డించారు. పంట వైవిధ్యం, జీరో-బడ్జెట్ వ్యవసాయం, కనీస మద్ధతు ధరలో పారదర్శకత వంటి అంశాలపై ఈ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీలో రైతు సంఘాల ప్రతినిధులు కూడా ఉంటారని తెలిపారు. రైతులు తమ ఆందోళనను ముగించి ఇంటికి వెళ్లాలని కోరుతున్నాన‌ని అన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement