లక్క లింగారెడ్డి ఇరవై ఏళ్ల పాటు సైనికుడిగా సేవలందించారు.తాజాగా ఉద్యోగవిరమణ చేసి సొంతూరుకు వచ్చారు. లింగారెడ్డిని ఘనంగా స్వాగతించిన గ్రామస్థులు.. అంతా కలిసి ఆయనకు సన్మానం చేశారు. ఈ సందర్భంగా లింగారెడ్డి మాట్లాడుతూ.. సైన్యంలో చేరడం సులభమే కావొచ్చు కానీ ఏళ్ల తరబడి సొంతూరుకు, కుటుంబానికి దూరంగా ఉంటూ విధులు నిర్వహించడం కష్టమేనని చెప్పారు. అయితే, ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా సరే దేశానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టమని లింగారెడ్డి వివరించారు.
కాగా దేశ రక్షణ కోసం 20 ఏళ్ల పాటు సైన్యంలో పనిచేసి తిరిగొచ్చిన జవానుకు సొంతూళ్లో ఘన స్వాగతం లభించింది. తన కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, గ్రామస్థులు కలిసికట్టుగా ఆయనను స్వాగతించారు. బాజా భజంత్రీలతో డ్యాన్సులు చేస్తూ జాతరను తలపించేలా చేశారు. నల్గొండ జిల్లా బట్టుగూడెం గ్రామంలో చోటుచేసుకుందీ ఘటన. కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు, స్నేహితులు, ప్రజాప్రతినిధులు తరలివచ్చి తనను స్వాగతించడంతో లింగారెడ్డి సంతోషంతో ఉక్కిరిబిక్కిరయ్యారు.