Friday, November 22, 2024

ఆగని ఆందోళనలు.. శ్రీలంకలో ఎమర్జెన్సీ..

శ్రీలంకలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం (అత్యవసర పరిస్థితి) ఎమర్జెన్సీని విధించింది. ఇప్పటికే ఆందోళనలు చేస్తూ అక్కడి ప్రజలు రోడ్డెక్కారు. ఆగ్రహంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబయ రాజపక్సపై దండయాత్రకు దిగారు. దీంతో గొటబయ తన పదవికి రాజీనామా చేయకుండానే ఆ దేశం నుంచి పారిపోయినట్టు ఇప్పటికే వార్తలు కూడా వచ్చాయి.

అయితే వేల సంఖ్యలో ఆందోళకారులు కొలంబోలోని అధ్యక్ష నివాసాన్ని చుట్టుముట్టడంతో పోలీసులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. అయినప్పటికీ వారు గొటబయకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. లోనికి చొచ్చుకురావడంతో.. పోలీసులు భాష్ప వాయువును ప్రయోగించారు. ఈ క్రమంలోనే నిరసనకారులు పోలీసుల వాహనాలపైకి రాళ్లు రువ్వగా.. పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు గాల్లో కాల్పులు జరిపారు. శ్రీలంకలో ఏర్పడ్డ రాజకీయ సంక్షోభం నేపథ్యంలో ఆ దేశ ప్రధాని గొటబయ నివాసం వద్ద మిలిటరీ దళాలతో భారీ భద్రతను ఏర్పాటు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement