పోస్ట్ మెనుస్ట్రువల్ సిండ్రోమ్... పీరియడ్కి ముందు 5 నుంచి 11 రోజుల మధ్య ఈ సిండ్రోమ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. పట్టరాని కోపం, విపరీతమైన టెన్షన్, ఆదుర్దా, మూడ్ స్వింగ్స్, ఫుడ్ క్రేవింగ్స్ , నిద్రలేమి ఈ సిండ్రోమ్ లక్షణాలు అంటున్నారు డాక్టర్లు. అలాగే కండరాలు, ఒళ్లు, ఛాతి నొప్పులు, తలనొప్పి, బరువు పెరగడం, కడుపు ఉబ్బరం కూడా ఉంటుందట. కొంతమంది అయితే పీరియడ్ కన్నా పోస్ట్ మెనుస్ట్రువల్ సిండ్రోమ్‌తోనే ఎక్కువ ఇబ్బందికి గురవుతారని చెబుతున్నారు. కానీ, ఈ సిండ్రోమ్ గురించి ఎవరూ నోరు విప్పి బయటికి చెప్పుకోరు. ప్రతినెలా మౌనంగానే ఆ నొప్పిని భరిస్తుంటారు చాలామంది. అయితే ఆడవాళ్లకి ఈ సిండ్రోమ్ నుంచి రిలీఫ్ ఇవ్వడానికి వచ్చినవే ‘గమ్మీ టెడ్డీస్’. ‘పవర్ గమ్మీస్’ అనే కంపెనీ ఈ స్పెషల్ గమ్మీలని రీసెంట్గా మార్కెట్లోకి తీసుకొచ్చింది.
బెర్రీ గుజ్జు, మిల్క్ థిస్టిల్ (బోడసారం) గింజలతో తయారుచేసిన ఈ గమ్మీలు పీఎమ్ఎస్ లో కనిపించే ఒళ్లు నొప్పులు, తిమ్మిర్లతో పాటు ఛాతి ఉబ్బు, నొప్పిని తగ్గిస్తాయి. ఈ గమ్మీలలోని విటమిన్–సి పీరియడ్ టైంలో బ్లీడింగ్ సజావుగా అయ్యేలా చూస్తుంది. మెగ్నీషియం, సల్ఫేట్ నిద్రలేమిని దూరం చేస్తాయి. సిట్రస్ బయో ఫ్లేవనాయిడ్స్, విటమిన్– బి6 ఆకలిని కంట్రోల్ చేస్తాయి. నెలసరి సైకిల్కి ముందు మూడురోజుల పాటు రోజుకో గమ్మీ, పీరియడ్లో నాలుగు గమ్మీలు, పీరియడ్ తర్వాత మూడు రోజుల పాటు ఈ గమ్మీలు తింటే చాలు. వీటిని powergummies.comలో కొనుగోలు చేయొచ్చని చెబుతన్నారు వైద్య నిపుణులు.