రష్యా ..ఉక్రెయిన్ పై చేస్తోన్న దాడులతో పలు బిల్డింగ్స్ ధ్వంసం అవుతున్నాయి. మరోవైపు ఉక్రెయిన్ సైన్యం కూడా రష్యా బలగాలను దీటుగా ఎదుర్కొంటోంది. ఈ క్రమంలో పెద్ద సంఖ్యలో రష్యా సైనికులు ఉక్రెయిన్ బలగాలు బంధీలుగా చిక్కుతున్నారు. మరోవైపు తమకు పట్టుబడిన రష్యన్ సైనికులను వారి తల్లులకు అప్పగించేందుకు ఉక్రెయిన్ ప్రభుత్వం సంసిద్ధతను వ్యక్తం చేసింది. ఉక్రెయిన్ కు వచ్చి మీ పిల్లలను తీసుకెళ్లాలని తెలిపింది. తల్లులు వస్తే వారి పిల్లలను అప్పగిస్తామని చెప్పింది. తాము ఉక్రెయిన్ పౌరులమని… తమది పుతిన్ లా ఫాసిస్టు ఆలోచనాధోరణి కాదని తెలిపింది. తల్లులు, వారి బిడ్డలపై తాము యుద్ధం చేయబోమని వెల్లడించింది.
Advertisement
తాజా వార్తలు
Advertisement