ఉక్రెయిన్పై రష్యా భీకర యుద్ధం కొనసాగుతోంది. యుద్ధం కారణంగా ఇప్పటివరకు వేలాది మంది ఉక్రెయిన్ సైనికులు, పౌరులు ప్రాణాలు కోల్పోయారు. తాజాగా ఉక్రేనియన్ నటుడు పాషా లీ తన దేశాన్ని రక్షించడంలో ప్రాణాలు కోల్పోయాడు. 33 ఏళ్ల పాషా లీ తన దేశాన్ని రక్షించడానికి గత వారం ఉక్రేనియన్ సాయుధ దళాల టెరిటోరియల్ డిఫెన్స్ ఫోర్సెస్లో చేరాడు. ఈ సమాచారాన్ని ఒడెస్సా ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఫేస్ బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది.
కాగా, పాషా లీ ఉక్రెయిన్లో నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకన్నాడు డబ్బింగ్ కళాకారుడు, గాయకుడు, మ్యూజిక్ డైరెక్టర్ గానూ వ్యవహరించాడు.