ఉక్రెయిన్పై రష్యా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తమ దేశాధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ను హత్య చేసేందుకు ఉక్రెయిన్ కుట్ర పన్నిందని.. మంగళవారం రాత్రి పుతిన్ కార్యాలయంపై రెండు డ్రోన్లతో దాడులు చేసిందని రష్యా ఆరోపించింది. తమ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ద్వారా కుట్రను భగ్నం చేశామని.. దాడి నుంచి పుతిన్ తృటిలో తప్పించుకున్నారని పేర్కొంది. రష్యా ఆరోపణలు ప్రస్తుతం అంతర్జాతీయ సమాజంలో కలకలం రేపుతున్నాయి. ఉక్రెయిన్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని రష్యా హెచ్చరించింది. ఉక్రెయిన్ పై ప్రతీకారం తీర్చుకుంటామని తెలిపింది..
Advertisement
తాజా వార్తలు
Advertisement