గత నెల రోజులకు పైగా ఉక్రెయిన్ వర్సెస్ రష్యా యుద్ధం కొనసాగుతోంది. అయితే ఉక్రెయిన్, రష్యా యుద్ధం మరో మలుపు తీసుకుంది. సొంతభూమిపై పుతిన్ సేనల దాడులను దీటుగా ఎదుర్కొంటూ వచ్చిన ఉక్రెయిన్ ఆర్మీ.. తొలిసారి రష్యా భూభాగంపై అటాక్ చేశాయి. బార్డర్ కు 35 కిలోమీటర్ల దూరంలోని బెల్గోరోద్ లో ఉన్న చమురు నిల్వ కేంద్రంపై ఉక్రెయిన్ సైనికులు హెలికాప్టర్ల ద్వారా బాంబులు కురిపించారు. ఈ విషయాన్ని స్థానిక గవర్నర్ వ్యాచెస్లావ్ గ్లాడ్ కోవ్ వెల్లడించారు. ఈ ఘటనలో ఇద్దరు సిబ్బంది గాయపడ్డారని తెలిపారు. చమురు కేంద్రం నుంచి భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని, వాటిని ఆర్పేందుకు 170 మంది సిబ్బంది ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. ఈ దాడిపై వ్యాఖ్యానించేందుకు ఉక్రెయిన్ రక్షణ మంత్రి దిమిత్రో కులేబా నిరాకరించారు.
Advertisement
తాజా వార్తలు
Advertisement