రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం కొనసాగుతున్న వేళ.. నేడు రెండో విడత చర్చలు జరుగనున్నాయి. రెండు దేశాలు శాంతి చర్చలకు అంగీకారం తెలపడంతో రెండో విడత చర్చలు ఇవాళ జరుగనున్నాయి. బెలారస్‌లోనే బుధవారం నాడు రెండో విడత చర్చలు జరపాలని ఇరు దేశాలు నిర్ణయించాయి. సోమవారం రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరిగిన శాంతి చర్చలు అసంపూర్తిగా ముగిసిన సంగతి తెలిసిందే. 3 గంటలకు పైగా జరిగిన ఈ చర్చల్లో ఇరు దేశాలు తమ తమ వాదనలకే కట్టుబడ్డాయి. దీంతో ఎలాంటి ఫలితం లేకుండానే చర్చలు ముగిశాయి. యుద్దాన్ని తక్షణమే విరమించాలని ఉక్రెయిన్ ఈ చర్చల్లో కోరుతోంది. అయితే, దానికి రష్యా మాత్రం అందుకు ససేమిరా ఉంటుంది. తొలి విడత జరిగిన చర్చల్లో ప్రాథమిక డిమాండ్లపై రెండు దేశాల ప్రతినిధులు పట్టు వదలలేదు. నాటో కూటమికి దూరంగా ఉండాలని అటు రష్యా పట్టుబడుతోంది. ఇవాళ జరిగే చర్చలు సఫలం అయ్యి.. యుద్ధం ఆగుతుందా? లేదా? అన్నది ఆసక్తిగా రేపుతోంది.
Advertisement
తాజా వార్తలు
Advertisement