రష్యా-ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల మధ్య కీలక పరిణామం చోటు చేసుకుంది. ఉక్రెయిన్ సైన్యం ఆయుధాలు వీడితే చర్చలకు సిద్ధమేనని రష్యా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, చర్చలపై తాజాగా ఉక్రెయిన్ కూడా స్పందించింది. నాటో కూటమిలో చేరకుండా తటస్థంగా ఉండే విషయంలో రష్యాతో చర్చలకు సిద్ధమేనని ఉక్రెయిన్ వెల్లడించింది.
కాగా, ఉక్రెయిన్ అధికారుల బృందంతో చర్చలకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా అధ్యక్షుడి కార్యాలయం ప్రకటించింది. చర్చల కోసం బెలారస్ రాజధాని మిన్‌స్క్‌కు రష్యా బృందాన్ని పంపిస్తామని చెప్పిన విషయం తెలిసిందే.