Monday, November 18, 2024

ర‌ష్యాలో ఉక్రెయిన్ రాయ‌బార కార్యాల‌యం మూసివేత‌

ర‌ష్యా వ‌ర్సెస్ ఉక్రెయిన్ మ‌ధ్య యుద్ధం కొన‌సాగుతోంది. ఉక్రెయిన్ పై ర‌ష్యా బీక‌ర దాడులు చేస్తోంది. కీల‌క న‌గ‌రాల‌ను ఆక్ర‌మించుకుంటూ ముందుకెళ్తోంది. అయితే ఈ యుద్ధం నేప‌థ్యంలో ర‌ష్యాలోని ఉక్రెయిన్ రాయ‌బార కార్యాల‌యాన్ని మూసేశారు. అక్క‌డి సిబ్బంది కూడా వెళ్లిపోయారు. దీంతో పాటు ఉక్రెయిన్ రాయ‌బార కార్యాల‌య గేట్ల‌ను కూడా సీల్ చేసేశారు. ఇక‌.. కార్యాల‌యంపై ఉండే ఉక్రెయిన్ జాతీయ జెండాను కూడా కిందికి దించేశారు. ర‌ష్యా సేన‌లు దూసుకువెళ్తున్నాయి. ఉక్రెయిన్‌లోని ఒక్కొక్క న‌గరాన్ని చేజిక్కించుకుంటున్నాయి. తాజాగా ఖేర్స‌న్ ప‌ట్ట‌ణాన్ని ర‌ష్యా బ‌ల‌గాలు ఆధీనంలోకి తీసుకున్న‌ట్లు తెలుస్తోంది. ద‌క్షిణ ప్రాంత న‌గ‌ర‌మైన ఖేర్స‌న్‌ను స్వాధీనం చేసుకున్న‌ట్లు ర‌ష్యా ర‌క్ష‌ణ మంత్రిత్వ కార్యాల‌యం పేర్కొన్న‌ది. ఒక‌వేళ ఖేర్స‌న్ న‌గ‌రం ర‌ష్యా చేతుల్లోకి వెళ్తే, అప్పుడు ఆ దేశం స్వాధీనం చేసుకున్న అతిపెద్ద ఉక్రెయిన్ న‌గ‌రం ఇదే అవుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement