Friday, November 22, 2024

ర‌ష్యా దండ‌యాత్ర‌ను నిలువ‌రించండి… భార‌త్ కు ఉక్రెయిన్ విజ్ఞ‌ప్తి

గ‌త మూడు రోజులుగా ఉక్రెయిన్ పై ర‌ష్యా బాంబుల వ‌ర్షం కురిపిస్తూ… దండ‌యాత్ర చేస్తోంది. అయితే ర‌ష్యాను త‌మ‌పై చేస్తున్న దండ‌యాత్ర‌ను ఆపేలా చూడాల‌ని ఉక్రెయిన్ భార‌త్ ను వేడుకుంటోంది. ఉక్రెయిన్ విదేశాంగమంత్రి డిమిట్రో కులేబ.. భారత విదేశాంగమంత్రి ఎస్​ జైశంకర్​కు ఫోన్ చేశారు. మాస్కోతో దౌత్య సంబంధాలను ఉపయోగించి ఎలాగైనా రష్యా తమదేశంపై చేస్తున్న దండయాత్రను ఆపేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. అంతేగాక ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉక్రెయిన్​లో శాంతిస్థాపనకు ఉద్దేశించిన తీర్మానానికి మద్దతు తెలపాలని కోరారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. దౌత్యం, చర్చలే ఏ సమస్యకైనా పరిష్కార మార్గమని కులేబకు జైశంకర్ సూచించారు. భారత్​ దీన్నే విశ్వసిస్తుందని పేర్కొన్నారు. ఉక్రెయిన్​ నుంచి భారత విద్యార్థులను సురక్షితంగా స్వదేశం తరలించేందుకు సహకరిస్తున్నందుకు కులేబకు కృతజ్ఞతలు చెప్పారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. అంతకుముందు ఉక్రెయిన్​పై రష్యా దాడిని ఖండిస్తూ ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ముసాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. 15 సభ్య దేశాల్లో 11 దీనికి మద్దతు తెలిపాయి. భారత్​, చైనా, యూఏఈ ఓటింగ్​కు దూరంగా ఉన్నాయి. వీటోను ఉపయోగించి రష్యా తీర్మానాన్ని అడ్డుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement