Friday, November 22, 2024

తెలంగాణకు యుకె స్టార్టప్‌ల సహకారం.. నయా టెక్నాలజీపై అవగాహన..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : యునైటెడ్‌ కింగ్‌డమ్‌(యూకే)కు చెందిన కొత్త తరం సాంకేతికతలపై పనిచేసే స్టార్టప్‌ల నుంచి తెలంగాణ ప్రభుత్వం సాంకేతిక సహకారం తీసుకుంటోంది. ప్రభుత్వంలోని 10 దాకా శాఖలు యూకే అంకురాల నుంచి సరికొత్త సాంకేతికతలపై సహకారం పొందే బీటూజీ ఎక్స్ఛేంజి కార్యక్రమాన్ని శనివారం హైదరాబాద్‌లో నిర్వహించారు. తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో యూకేకు చెందిన 11 స్టార్టప్‌లు పాల్గొనగా తెలంగాణ ప్రభుత్వంలోని టీఎస్‌ఎస్పీడీసీఎల్‌, సీడీఎంఏ, జీహెచ్‌ఎంసీ, ట్రాఫిక్‌ తదితర విభాగాల నుంచి 70 మంది దాకా సిబ్బంది పాల్గొన్నారు.

యూకే స్టార్టప్‌ల ప్రతినిధులు ఈ శాఖల సిబ్బందికి సాంకేతికతపై అవగాహన కల్పించారు. తెలంగాణ ఒక స్టార్టప్‌ రాష్ట్రమని, ఇక్కడి పరిపాలన వ్యవస్థలోనూ అన్ని రకాల సాంకేతికతలను ఉపయోగించుకోవాలి అన్నదే తమ ఉద్దేశమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూకే స్టార్టప్‌ల ప్రతినిధులతో పాటు తెలంగాణ ఎమర్జింగ్‌ టెక్నాలజీ వింగ్‌ డైరెక్టర్‌ రమాదేవీ లంక తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement