యుద్ధభూమి ఉక్రెయిన్‌లో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ హఠాత్తుగా పర్యటించారు. రాజధాని కీవ్ వీధుల్లో ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో కలిసి కీవ్ వీధుల్లో తిరిగారు. కీవ్‌ను రష్యా బలగాలు చుట్టిముట్టిన వేళ ఆయన ఉక్రెయిన్‌లో పర్యటించడం గమనార్హం. రష్యా సేనలు పెద్దఎత్తున దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఎలాంటి ముందస్తు ప్రకటన లేకుండా ఆయన నేరుగా కీవ్ చేరుకున్నారు. రష్యాపై పోరుకు మరిన్ని ఆయుధాలిస్తామని భరోసా ఇచ్చారు. ఉక్రెయిన్ పౌరులకు ధైర్యాన్నిచ్చేందుకే తాను పర్యటించానని బోరిస్ చెప్పారు. రష్యా విధ్వంసానికి బలవుతున్న దేశానికి అండగా నిలబడటం తమ విధి అని తెలిపారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌కు మరింతగా ఆర్థిక, సైనిక సాయం అందిస్తామని ప్రకటించారు.
Surprise: ఉక్రెయిన్‌లో బ్రిటన్ ప్రధాని పర్యటన.. కీవ్ వీధుల్లో తిరిగిన బోరిస్ జాన్సన్
Advertisement
తాజా వార్తలు
Advertisement