Monday, November 25, 2024

UK PM Race: యూకే ప్రధానిగా గెలిచేదెవరు? లిజ్​ ట్రస్ కే ఎక్కువ చాన్స్!

యూకే ప్రధాని ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. కన్జర్వేటివ్‌ పార్టీ సభ్యులు తమ ఓటును కొందరు పోస్టల్‌లో.. మరి కొందరు ఆన్‌లైన్‌లో వేశారు. ఈనెల 5వ తేదీన (సోమవారం) ఫలితం వెలువడనున్నది. కాగా, ప్రధాని ఎవరని టోరీ నేతలు మాత్రం చర్చించుకోవడం లేదు. ఎందుకంటే వారంతా ఎవరికి ఓటేయాలనుకుంటున్నారో ఫిక్స్‌ అయినట్టు వారి ప్రవర్తనను బట్టి తెలుస్తోంది. ప్రధాని ఎన్నిక ప్రచారంలో అభ్యర్థులు మాత్రమే కాకుండా పరోక్షంగా బోరిస్‌ జాన్సన్‌ కూడా పాల్గొన్నట్టు తెలుస్తోంది. అయితే.. అతడికి (సునక్​) తప్ప ఎవరికైనా ఓటేయండన్న బోరిస్‌ సూచనలు నిజం కానున్నట్టు వార్తలు వెలువడుతున్నాయి. టోరీ నేతలు ఎవరికి ఓటేయాలో ఇప్పటికే ఇన్‌స్ట్రక్షన్స్‌ వెళ్లాయన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.  

బ్రిటన్‌ ప్రధాని ఎన్నిక పోలింగ్‌ ముగిసింది. 2 లక్షల మంది టోరీ సభ్యులు తమ ఓటుహక్కును ఇవ్వాల వినియోగించుకున్నారు. ప్రధాని ఎవరో వారి ఓట్లు తేల్చనున్నాయి. 10 డౌన్‌ స్ట్రీట్‌ నుంచి తాను వెళ్లిపోయేలా చేసిన వ్యక్తిని ఎట్టి పరిస్థితుల్లో గెలవకుండా చేయాలని బోరిస్​ శపథం చేసినట్టు తెలుస్తోంది. దీంతో టోరీ నేతలు అందుకు అనుగుణంగానే కాబోయే ప్రధానికి ఓటేసినట్టు సమాచారం. టోరీ పార్టీ చీఫ్‌, ప్రధానమంత్రి ఎవరు కానున్నారో ఇప్పటికే అర్థమైందని కొంతమంది గుసగులాడుతున్నారు.  

కాగా, లిజ్​ ట్రస్, సునక్ మధ్య – సోమవారం లంచ్ టైమ్‌లో వెస్ట్ మినిస్టర్‌లో జరిగే కార్యక్రమంలో బ్యాలెట్ ఫలితం ప్రకటించనున్నారు. ఇక ట్రస్ కొత్త టోరీ నాయకుడిగా కిరీటాన్ని పొందుతారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. విదేశాంగ కార్యదర్శి ఈ వారాంతంలో అంటే నంబర్ 10వ తేదీన ఆమె ప్రవేశానికి సన్నాహాలను చేస్తున్నట్టు డైలీ మెయిల్ తన కథనంలో తెలిపింది. కానీ సునక్ మిత్రుడు, మాజీ ఛాన్సలర్ మాత్రం దీన్ని ఒప్పుకోవడం లేదు. ఈ సారి నెక్​ టు నెక్​ ఫైట్​ జరిగిందని, సునక్​ కూడా విజయం సాధించే అవకాశం ఉందని అంటున్నారు. 

Advertisement

తాజా వార్తలు

Advertisement