Friday, November 22, 2024

రాజీనామా చేసే ప్రసక్తే లేదు: బ్రిటన్ ప్రధాని

తన పదవికి రాజీనామా చేసే ప్రసక్తే లేదని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ స్పష్టం చేశారు. ‘పార్టీ గేట్’ కుంభకోణం ఆ దేశంలో వివాదాస్పదమైన నేపథ్యంలో ప్రధాని పదవికి రాజీనామా చేయాలని బోరిస్పై ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్పందించిన బోరిస్ జాన్సన్.. తనపై ఎంత ఒత్తిడి తీసుకొచ్చినా రాజీనామా చేసే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.

2020-21 కొవిడ్ లాక్‌డౌన్ సమయంలో ప్రధాని నివాసం ఉండే డౌనింగ్ స్ట్రీట్‌తోపాటు మరికొన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో కొవిడ్ ఆంక్షలను ఉల్లంఘించి నిర్వహించిన పార్టీలకు ప్రధాని బోరిస్ జాన్సన్ హాజరయ్యారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆయన రాజీనామా చేయాలంటూ ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై స్పందించిన ప్రధాని రాజీనామాకు తిరస్కరించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement