Tuesday, November 26, 2024

Spl Story: దారి తప్పి యూకే నుంచి యూఎస్​కు జర్నీ.. 6,438 కిలోమీటర్లు ఎగురుతూ వెళ్లిన పావురం!

యునైటెడ్​ కింగ్​డమ్​ (యూకే​)లో ఒక రేసింగ్​ పావురం తప్పిపోయింది. ఒక పోటీలో పాల్గొన్న తర్వాత అది ఫస్ట్​ ఫ్రైజ్​ కొట్టేసింది. దాని యజమాని బహుమతి కూడా అందుకున్నాడు. ఆ తర్వాత అది అలా ఎగురుతూ.. ఎగురుతూ దారి తప్పింది. అయితే.. అలా కనిపించకుండా పోయిన పావురం కోసం యజమాని ఎంతగానో వెతికాడు. చివరికి అది యజమానికి దగ్గరికి ఎలా చేరిందో ఈ ముచ్చట చదవి తెలుసుకోండి..

– డిజిటల్​ మీడియా విభాగం, ఆంధ్రప్రభ

యుకేలో (ఇంగ్లండ్​) ఉండే టెడ్​ అనే వ్యక్తికి బాబ్​ అనే అరుదైన పావురం ఉంది. దాంతో ఎక్కువగా రేసింగ్​ పోటీల్లో పాల్గొంటాడు. దాని చలాకీతనం, పోటీలో ఎన్ని పావురాలున్నా అది గెలిచే విధానం చూస్తే అందరికీ ముచ్చటేస్తుంది. అయితే.. ఓ రోజు ఉన్నట్టుండి బాబ్​ కనిపించకుండా పోయింది. మూడు వారాల క్రితం ఛానల్​ దీవులలోని గ్వెర్న్సీ నుంచి బయలుదేరింది. ఈశాన్య ఇంగ్లండ్​లో ఉన్న తన ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా దారి తప్పింది. బాబ్ కనిపించకుండా పోవడంతో దాని యజమాని టెడ్​ ఆందోళనకు గురయ్యాడు. దానికి ఏమైందోనని అన్ని చోట్ల వెతికాడు. తెలిసిన వారికి ఫోన్​ చేసి ఎంక్వైరీ చేశాడు. అయినా దాని జాడ తెలియలేదు.  

అయితే.. అది దాదాపు 4 వేల మైళ్లు అంటే 6,438 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దానికి ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియకపోవడంతో దగ్గర్లో ఉన్న ఓ తోటలోనే ఆగిపోయింది. దాని ప్రయాణం 10 గంటలకు పైగా సాగినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు జులై 6వ తేదీన అలబామాలోని మన్రో కౌంటీకి చెందిన మెక్సియాలోని గార్డెన్​లో ఒక ఓల్డ్​ ఏజ్​ పర్సన్​​ ఈ పావురాన్ని చూశాడు. దీంతో బాబ్​ మిస్టరీ వీడిపోయింది.

అయితే.. అది ఆ తోట నుంచి బయటికి వెళ్లడానికి  నిరాకరించడంతో అతను స్థానిక జంతు సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించాడు. వారు వచ్చి బాబ్​ని పరిశీలించారు. పావురం విలక్షణమైన లెగ్ బ్యాండ్‌లను ధరించి ఉన్నందున బాబ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సముద్రానికి అవతలి వైపున ఉంటుందని వారు గుర్తించారు. జంతు సంరక్షణ కేంద్రం వద్ద ఉన్న సిబ్బంది దాని యజమానికి ఈ సమాచారాన్ని చేరవేశారు..

- Advertisement -

అయితే.. చాలా దూరం ఎగురుతూ రావడం, సరైన ఫుడ్​ లేకపోవడంతో ఆ పావురం ఆరోగ్యం కాస్త దెబ్బతింది. మునుపటి కంటే బరువు తక్కువగా ఉన్నప్పటికీ హెల్దీగానే ఉన్నట్టు వారు తెలిపారు.  వెటర్నరీ డాక్టర్​తో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎట్లాంటి ప్రాబ్లం లేదని, చాలా దూరం ఎగురుతూ రావడం వల్ల కాస్త ఇబ్బందిగా​ఉందని వెట్​ డాక్టర్​ చెప్పారు.  కాగా, ఈ రేసింగ్ పావురం విలువ 1,000 పౌండ్ల కంటే ఎక్కువ అంటే దాదాపు ఒక లక్ష రూపాయలుగా గుర్తించారు.

యూకేలోని విన్లాటన్‌లో నివసిస్తున్న అలాన్ టేడ్‌కు చెందిన పావురంగా తెలియడంతో అతనికి ఈ సమాచారం అందజేశారు. దీంతో టేడ్​ తన పక్షిని తిరిగి తెచ్చుకునే అవకాశం దక్కింది. అయితే.. బాబ్ అట్లాంటిక్‌ను దాటి వచ్చాడని, ఆ క్రమంలోనే రాంగ్ టర్న్ తీసుకున్నట్టు తాను భావిస్తున్నట్టు టేడ్​ చెప్పాడు. ఈ రేసింగ్ పావురాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్లి తీసుకోవాలని బాబ్​ యత్నిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement