యునైటెడ్ కింగ్డమ్ (యూకే)లో ఒక రేసింగ్ పావురం తప్పిపోయింది. ఒక పోటీలో పాల్గొన్న తర్వాత అది ఫస్ట్ ఫ్రైజ్ కొట్టేసింది. దాని యజమాని బహుమతి కూడా అందుకున్నాడు. ఆ తర్వాత అది అలా ఎగురుతూ.. ఎగురుతూ దారి తప్పింది. అయితే.. అలా కనిపించకుండా పోయిన పావురం కోసం యజమాని ఎంతగానో వెతికాడు. చివరికి అది యజమానికి దగ్గరికి ఎలా చేరిందో ఈ ముచ్చట చదవి తెలుసుకోండి..
– డిజిటల్ మీడియా విభాగం, ఆంధ్రప్రభ
యుకేలో (ఇంగ్లండ్) ఉండే టెడ్ అనే వ్యక్తికి బాబ్ అనే అరుదైన పావురం ఉంది. దాంతో ఎక్కువగా రేసింగ్ పోటీల్లో పాల్గొంటాడు. దాని చలాకీతనం, పోటీలో ఎన్ని పావురాలున్నా అది గెలిచే విధానం చూస్తే అందరికీ ముచ్చటేస్తుంది. అయితే.. ఓ రోజు ఉన్నట్టుండి బాబ్ కనిపించకుండా పోయింది. మూడు వారాల క్రితం ఛానల్ దీవులలోని గ్వెర్న్సీ నుంచి బయలుదేరింది. ఈశాన్య ఇంగ్లండ్‌లో ఉన్న తన ఇంటికి తిరిగి రావాల్సి ఉండగా దారి తప్పింది. బాబ్ కనిపించకుండా పోవడంతో దాని యజమాని టెడ్ ఆందోళనకు గురయ్యాడు. దానికి ఏమైందోనని అన్ని చోట్ల వెతికాడు. తెలిసిన వారికి ఫోన్ చేసి ఎంక్వైరీ చేశాడు. అయినా దాని జాడ తెలియలేదు.
అయితే.. అది దాదాపు 4 వేల మైళ్లు అంటే 6,438 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. దానికి ఇంటికి ఎలా చేరుకోవాలో తెలియకపోవడంతో దగ్గర్లో ఉన్న ఓ తోటలోనే ఆగిపోయింది. దాని ప్రయాణం 10 గంటలకు పైగా సాగినట్టు తెలుస్తోంది. ఎట్టకేలకు జులై 6వ తేదీన అలబామాలోని మన్రో కౌంటీకి చెందిన మెక్సియాలోని గార్డెన్లో ఒక ఓల్డ్ ఏజ్ పర్సన్ ఈ పావురాన్ని చూశాడు. దీంతో బాబ్ మిస్టరీ వీడిపోయింది.
అయితే.. అది ఆ తోట నుంచి బయటికి వెళ్లడానికి నిరాకరించడంతో అతను స్థానిక జంతు సంరక్షణ కేంద్రానికి సమాచారం అందించాడు. వారు వచ్చి బాబ్‌ని పరిశీలించారు. పావురం విలక్షణమైన లెగ్ బ్యాండ్‌లను ధరించి ఉన్నందున బాబ్ యునైటెడ్ కింగ్‌డమ్‌లోని సముద్రానికి అవతలి వైపున ఉంటుందని వారు గుర్తించారు. జంతు సంరక్షణ కేంద్రం వద్ద ఉన్న సిబ్బంది దాని యజమానికి ఈ సమాచారాన్ని చేరవేశారు..
అయితే.. చాలా దూరం ఎగురుతూ రావడం, సరైన ఫుడ్ లేకపోవడంతో ఆ పావురం ఆరోగ్యం కాస్త దెబ్బతింది. మునుపటి కంటే బరువు తక్కువగా ఉన్నప్పటికీ హెల్దీగానే ఉన్నట్టు వారు తెలిపారు. వెటర్నరీ డాక్టర్‌తో అన్ని వైద్య పరీక్షలు నిర్వహించారు. ఎట్లాంటి ప్రాబ్లం లేదని, చాలా దూరం ఎగురుతూ రావడం వల్ల కాస్త ఇబ్బందిగాఉందని వెట్ డాక్టర్ చెప్పారు. కాగా, ఈ రేసింగ్ పావురం విలువ 1,000 పౌండ్ల కంటే ఎక్కువ అంటే దాదాపు ఒక లక్ష రూపాయలుగా గుర్తించారు.
యూకేలోని విన్లాటన్‌లో నివసిస్తున్న అలాన్ టేడ్‌కు చెందిన పావురంగా తెలియడంతో అతనికి ఈ సమాచారం అందజేశారు. దీంతో టేడ్ తన పక్షిని తిరిగి తెచ్చుకునే అవకాశం దక్కింది. అయితే.. బాబ్ అట్లాంటిక్‌ను దాటి వచ్చాడని, ఆ క్రమంలోనే రాంగ్ టర్న్ తీసుకున్నట్టు తాను భావిస్తున్నట్టు టేడ్ చెప్పాడు. ఈ రేసింగ్ పావురాన్ని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకు వెళ్లి తీసుకోవాలని బాబ్ యత్నిస్తున్నాడు.