Friday, November 22, 2024

కేసీఆర్‌ జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్న యూకే ఎన్నారైలు.. లండన్​ బ్రిడ్జి దగ్గర భారీ కటౌట్​ ఏర్పాటు!

కేసీఆర్‌ దేశ రాజకీయాల్లోకి రావాలని, వారి నూతన జాతీయ పార్టీ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు యూకే ఎన్నారైలు తెలిపారు. చారిత్రాత్మక లండన్ టవర్ బ్రిడ్జ్ వద్ద సమావేశమైన ఎన్నారైలు కేసీఆర్‌కు మద్దతుగా నినాదాలు చేశారు. యూకే లో నివసిస్తున్న వివిధ రాష్ట్రాలకు చెందిన ఎన్నారైలు సైతం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించి భారత దేశానికి నాయకత్వం వహించాల‌ని, దేశ గతిని మార్చాలని కోరారు.

ఇప్పుడు దేశమంతా తెలంగాణ మోడల్ వైపు చూస్తోంద‌ని , రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు, జరుగుతున్న అభివృద్ధి దేశమంతా జరగాలంటే కేసీఆర్ వ‌ల్లే సాధ్యమని ఎన్నారైలు తెలిపారు. ‘‘దేశ్​ కీ నేత కేసీఆర్​” అంటూ భారీ కటౌట్ పెట్టారు. కేసీఆర్​ అతిపెద్ద కటౌట్​ లండన్​ టవర్​ బ్రిడ్జి దగ్గర ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర చలనచిత్రాభివృద్ధి సంస్థ చైర్మన్ అనిల్ కూర్మాచలంతో పాటు ఎన్నారైలు అశోక్ దుసారి , రత్నాకర్ కడుదుల, నవీన్ రెడ్డి, హరి నవాపేట్, సృజన్ రెడ్డి, సత్యమూర్తి చిలుముల, సతీష్ గొట్టెముక్కల, సురేష్ గోపతి , రమేష్ ఎసెంపల్లి, నవీన్ భువనగిరి, రవి రేతినేని, సురేష్ బుడగం, రవి ప్రదీప్, సతీష్ గొట పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement