Friday, November 22, 2024

అయోధ్య రికార్డ్ బ‌ద్ద‌లు – గిన్నిస్ వ‌ర‌ల్డ్ రికార్డ్స్ లో ఉజ్జ‌యిని – 11ల‌క్ష‌ల మ‌ట్టి దీపాలు

ఈ ఏడాది శివ‌రాత్రి సంద‌ర్భంగా ఉజ్జ‌యినిలో ఏక కాలంలో 11ల‌క్ష‌ల‌కు పైగా మ‌ట్టి దీపాలు వెలిగించారు. దాంతో అయోధ్య రికార్డును బద్దలు కొట్టి, ఉజ్జయిని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో పేరు నమోదు చేసుకుంది. ఈ మట్టి దీపాలన్నీ కేవలం 10 నిమిషాల్లోనే వెలిగించారు.,ఉజ్జయినిలోని రామ్‌ఘాట్‌లో 11 లక్షల, 71 వేల, 78 దీపాలు వెలిగాయి. గతంలో దీపావళి రోజున అయోధ్యలో 9 లక్షల, 41 వేల మట్టి దీపాలు వెలిగించారు. రామ్‌ఘాట్‌లో దీపం వెలిగించే సమయంలో గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం కూడా అక్కడే ఉంది, ఆ దీపాల‌ని డ్రోన్‌తో పరిశీలించారు. ప్రపంచ రికార్డు సృష్టించే సమయంలో రామ్‌ఘాట్ వద్ద సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా ఉన్నారు.సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌, ఆయన సతీమణి సాధనాసింగ్‌ తొలి దీపాన్ని వెలిగించారు. ఉజ్జయినిలో ప్రపంచ రికార్డు నెలకొల్పిన తర్వాత బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement