మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ఫైనల్ స్టేజ్‌కి చేరుకుంది. వారం పది రోజులుగా ఎన్నో కీలక మలుపులు తీసుకున్న ఈ రాజకీయ వివాదం రేపటితో ముగియనున్నట్టు తెలుస్తోంది. గవర్నర్ పిలుపు మేరకు రేపు శాసన సభలో సీఎం ఉద్ధవ్ థాకరే బలపరీక్ష నిర్వహించుకోవాల్సి ఉండగా.. ఆయన సుప్రీం కోర్టుకు వెళ్లారు. కాగా, దీనిపై మూడున్నర గంటలపాటు వాదనలు కొనసాగినట్టు తెలుస్తోంది.. అయినా ఈ విషయంలో గవర్నర్ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు సమర్థించింది. దీంతో రేపు అనగా 30వ తేదీన మహారష్ట్ర అసెంబ్లీలో సీఎం ఉద్ధవ్ థాకరే బల పరీక్షకు సిద్ధం కావాల్సి ఉంటుంది. ఇప్పటికే రెబల్ ఎమ్మెల్యేలంతా కలిసి గోవాలో మకాం వేశారు. రేపు అసెంబ్లీ సమయానికల్లా వారు చేరుకునేలా రెబల్ లీడర్ ఏక్నాథ్ షిండే ప్లాన్ చేసినట్టు సమాచారం
Advertisement
తాజా వార్తలు
Advertisement