సినిమాల్లో హీరోగా రాణించారు ఉదయనిధి స్టాలిన్.. కాగా ఆయన ఇప్పుడు రాజకీయాల్లో తనదైనశైలిలో దూసుకుపోతున్నారు. కాగా ఆయన మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారట.. ఆయనకు యువజన సంక్షేమం, క్రీడాల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేటాయించే అవకాశముందని సమాచారం. ద్రవిడ మున్నేట్ర కజగం (డీఎంకే) యువజన విభాగం కార్యదర్శి ఉదయనిధిని స్టాలిన్ డిసెంబర్ 14 న మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్టు రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొందని వార్తలు వచ్చాయి. ఆయనకు యువజన సంక్షేమం, క్రీడల అభివృద్ధి మంత్రిత్వ శాఖను కేటాయించే అవకాశముందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
కాగా, ఉదయనిధి స్ఠాలిన్ తొలిసారిగా పార్టీ ఎమ్మెల్యే, యువజన విభాగం కార్యదర్శి.. ఇప్పుడు మంత్రిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. ఇదే విషయంపై ప్రతిపక్షాలు డీఎంకే తీరుపై మండిపడుతూ.. రాజవంశ రాజకీయ ఆరోపణలను గుప్పించడానికి సిద్ధమవుతున్నాయి. రాజ్ భవన్ విడుదల చేసిన పత్రికా ప్రకటనలో, గౌరవనీయులైన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్.. తిరు ఉదయనిధి స్టాలిన్, చెపాక్-తిరువల్లికేణి అసెంబ్లీ నియోజకవర్గం నెం.19 మంత్రుల మండలిలో చేర్చుకోవాలని గౌరవనీయులైన తమిళనాడు గవర్నర్‌కు సిఫార్సు చేశారు అని పేర్కొంది. గౌరవనీయమైన గవర్నర్ సిఫార్సును ఆమోదించారు. ప్రమాణ స్వీకారోత్సవం 14 డిసెంబర్ 2022న ఉదయం 9.30 గంటలకు రాజ్ భవన్, చెన్నై-22లో దర్బార్ హాల్‌లో జరుగుతుందని ప్రకటన పేర్కొంది. కాగా ఉదయనిధి స్టాలిన్ 2019 నుండి డీఎంకే యువజన కార్యదర్శిగా ఉన్నారు.