అత్యాధునిక సౌకర్యాలతో ప్రయాణికులను అలరించే ఉదయ్ ఎక్స్‌ప్రెస్ రైలు కోయంబత్తూరు, బెంగళూరు మధ్య తిరిగి ప్రారంభం కానుంది. ఈ ఉత్క్రిష్ట్ డబుల్ డెక్కర్ ఎయిర్ కండిషన్డ్ యాత్రి (ఉదయ్) ఎక్స్ ప్రెస్‌ను మార్చి 31 నుండి తిరిగి ప్రవేశపెట్టనున్నట్లు భారతీయ రైల్వే, దక్షిణ జోన్ ప్రకటించింది. రైల్వే బోర్డు ఆమోదించిన ప్రకారం రైలు నం.22666 / 22665 కోయంబత్తూర్ Jn- KSR బెంగళూరు-కోయంబత్తూరు (బుధవారాలు మినహా) ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లు 31 మార్చి నుండి అమలులోకి వస్తాయని దక్షిణ రైల్వే తెలిపింది. బుధవారం మినహా వారానికి ఆరు రోజులు కోయంబత్తూరు, బెంగళూరు మధ్య ఉదయ్ ఎక్స్ ప్రెస్ నడుస్తుంది.
-ప్రయాణికుల సౌలభ్యం కోసం ఉదయ్ ఎక్స్ ప్రెస్ పూర్తిగా ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ తో రూపొందించారు. GPS ఆధారిత ప్రయాణికుల సమాచార వ్యవస్థ.. Wi-Fi సౌకర్యం వంటి కొత్త ఫీచర్లను ఈ రైలులో ఏర్పాటు చేశారు. ఎయిర్ కండిషన్డ్ డబుల్ డెక్కర్ కోచ్‌లు, చైర్ క్లాస్ తో పాటు..- ఇందులో ఫుడ్ వెండింగ్ మెషీన్లు, ప్రయాణికుల కోసం ప్రత్యేకమైన డైనింగ్ ఏరియా కూడా ఉంటాయి.
రైలు మార్గాలు
-రైలు 22666 కోయంబత్తూరు జంక్షన్ నుండి ఉదయం 5.45 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 12.40 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది.
రైలు 22665 బెంగళూరులో మధ్యాహ్నం 2.15 గంటలకు బయలుదేరి రాత్రి 9 గంటలకు కోయంబత్తూరు జంక్షన్‌కు చేరుకుంటుంది. అధునాతన ఉదయ్ ఎక్స్ ప్రెస్ రైళ్లకు రిజర్వేషన్‌లు ఫిబ్రవరి 24 నుండి అందుబాటులో ఉంటాయని అధికారులు పేర్కొన్నారు.