Saturday, November 23, 2024

Breaking: ఉదయ్​పూర్​ డిక్లరేషన్​.. కాంగ్రెస్​ పార్టీ కీలక ప్రతిపాదనలు ఏమిటంటే..

కాంగ్రెస్ పార్టీ జరిపిన మేధో మథనం చింతన్ శివిర్​లో మూడో రోజు పలు కీలక అంశాలపై చర్చించి పార్టీ హైకమాండ్​ ఆమోదం తెలిపింది. ఉదయ్​పూర్​ డిక్లరేషన్​గా పేర్కొన్న ఈ అంశాలను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. పార్టీ కీలక నేతలు తెలిపిన వివరాల ప్రకారం.. ఆమోదం పొందిన కీలక ప్రతిపాదనలు ఏమిటంటే..

1) ఒక కుటుంబం, ఒక టికెట్:

ఈ ప్రతిపాదన ప్రకారం పార్టీ నేతల బంధువులకు టిక్కెట్లు ఇవ్వరు. అయితే, సంబంధిత బంధువు పార్టీలో కనీసం ఐదేళ్లు పనిచేసినట్లయితే వారికి పార్టీ టిక్కెట్ ఇవ్వవచ్చు.

2) స్థిర పదవీకాలం:

ఆలిండియా కాంగ్రెస్ కమిటీ (AICC), ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలు, జిల్లా, బ్లాక్ కమిటీలు, వివిధ విభాగాలు/సెల్‌లతో పాటు ఫ్రంటల్ ఆర్గనైజేషన్‌ల నుండి అన్ని పదవులను కాలాన్ని ఐదేళ్లపాటు నిర్ణయించాలని ప్రతిపాదన పేర్కొంది. ఈ పదవీకాలం ముగియగానే ఆఫీస్ బేరర్లు తమ పదవులకు రాజీనామా చేయాల్సి ఉంటుంది. కాగా, ఆ లీడర్ తిరిగి అదే పదవికి వచ్చినట్లయితే దీని తర్వాత మూడు సంవత్సరాలపదవీ కాలమం  మాత్రమే ఉంటుంది.

- Advertisement -

3) 50/50 :

అన్ని కమిటీల సభ్యులలో యాభై శాతం మంది 50 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు గలవారు. పాదయాత్రలు, జనతా దర్బార్‌లతో జనంతో మమేకమై బీజేపీపై పోరాటం చేయాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement