ఇంటికి పునాది గట్టిగా ఉండాలంటారు. సిమెంట్, ఇసుకతో దిట్టంగా కడుతుంటారు.. దాంతో ఇప్పుడంతా కాంక్రీట్ మయంగా మారిపోతోంది. అయితే ఇకపై అంతకష్టం లేదట. ఎంచక్కా చక్కలతో ఇంటిని నిర్మించుకోవచ్చట. అంతేనా ఆ ఇంటితో సహా ఎక్కడికంటే అక్కడి వెళ్ళిపోవచ్చు కూడా.. వివరాలు చూద్దాం .. యూబిసాప్ట్ సంస్థకు చెందిన త్రీడీ డిజైనర్ ఎంకో ఎన్షెన్ ఓ ఇంటిని రూపొందించాడు. కాగా ఈ ఇంటికి కాళ్ళు కూడా ఉన్నాయని మీకు తెలుసా.. ఇంటికి కాళ్ళ అని ఆశ్చర్యపోకండి. ఈ ఇల్లు ఎక్కడికంటే అక్కడికి కదులుతుందట, ఇదొక రెట్రో ఫ్యూచరిస్టిక్ డిజైన్ అని ఈ ఇంటిని డిజైన్ చేసిన ఎన్షెన్ తెలిపాడు. సో ఎంచక్కా నడిచే ఇంటిలో ఎక్కడికైనా వెళ్ళొచ్చు .. ఎన్ని రోజులు అయినా ప్రయాణం చేయొచ్చు.
Advertisement
తాజా వార్తలు
Advertisement