చిప్స్, సెమీ కండర్లకోసం చైనాపై ఆధారపడకుండా ఉండేందుకు అమెరికా చర్యలు చేపట్టింది. చైనాతో సెమీకండక్టర్ పోటీని పెంచే బిల్లు కోసం ప్రయత్రాలు చేస్తోంది. ఈక్రమంలో మొదటి సంస్కరణను ఆమోదించింది. దీంతో US సెనేట్ కంప్యూటర్ చిప్ పరిశ్రమకు 50 బిలియన్ల డాలర్లు(దాదాపు 4వేల కోట్లు) కంటే ఎక్కువ రాయితీలను అందించే చట్టం చేయనుంది. దీనికి స్లిమ్డ్-డౌన్ వెర్షన్‌పై మంగళవారం ఓటింగ్ ప్రారంభించింది. సెనేట్ యొక్క డెమొక్రాటిక్ మెజారిటీ నాయకుడు చక్ షుమెర్ మొదటి విధానపరమైన ఓటు ఇవ్వాల జరిగినట్టు ప్రకటించారు.U.S. సెమీకండక్టర్ తయారీతో జాతీయ భద్రతతో పాటు ఉద్యోగాల కల్పనకు ఎంతో మేలు జరుగుతుందన్నారు.
వచ్చే వారం ప్రారంభంలో ఈ బిల్లును ఆమోదించడమే తమ లక్ష్యమని సెనేట్ సహాయకులు తెలిపారు. ఈ బిల్లును ప్రతినిధుల సభకు పంపనున్నారు. దీని ఆమోదం తర్వాత చట్టంగా సంతకం చేయడానికి అధ్యక్షుడు జో బిడెన్ కోసం వైట్ హౌస్‌కు పంపిస్తారు. US సెమీకండక్టర్ పరిశ్రమను పునర్నిర్మించడానికి $52 బిలియన్లు, యునైటెడ్ స్టేట్స్లో ప్లాంట్లను నిర్మించడానికి కంపెనీలకు పన్ను ప్రోత్సాహకాలు ఈ బిల్లులో ఉన్నాయని సెనేట్ సహాయకులు తెలిపారు.
అయితే.. అమెరికాలో చిప్‌లను తయారు చేయడం లాభదాయకం కాదని కంపెనీలు భావించినట్లయితే.. వారు వేరే చోటికి వెళ్లవచ్చని షుమర్ సెనేట్ను ప్రారంభంలో చెప్పారు. జూన్ 2021లో సాంకేతిక పరిశోధన మరియు అభివృద్ధిపై వ్యయాన్ని పెంచే ద్వైపాక్షిక $250 బిలియన్ల బిల్లును సెనేట్ ఆమోదించింది.