Thursday, November 21, 2024

విత్ అవుట్ సెక్యూరిటీ.. ఆటోని న‌డిపిన అమెరికా దౌత్య‌వేత్త‌లు

ఢిల్లీ రోడ్ల‌పై ఆటోని న‌డుపుతూ అక్క‌డి అందాల‌ను ఆస్వాధిస్తున్నారు అమెరికా దౌత్య‌వేత్త‌లు. అంతేకాదు..తమ కార్యాలయాలకు, ఇతర పనుల కూడా..ఆ ఆటోనే ఉపయోగిస్తున్నారు. వారు ఈ న‌లుగురు మ‌హిళ‌లు ఎన్. ఆలే. మాసన్, షరీన్ J. కిట్టర్‌మాన్, రూత్ హోంబర్గ్ .. జెన్నిఫర్ బైవాటర్స్.వీరంతా బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను, భద్రతా సిబ్బందిని వదిలి ఆటోల్లో ఢిల్లీ వీధుల్లో తిరగ‌డం విశేషం. ప్రజలు వారిని చూసి ఆశ్చర్యపోతున్నారు. భారత సంబంధాలను బలోపేతం చేయడమే ఈ పర్యటన ఉద్దేశమని తెలిపారు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే..ఈ మహిళలందరూ తమ పనుల కోసం .. ఆటోను స్వయంగా నడుపుకుంటూ ప్రయాణించడానికి ఇష్టపడతారు. దీనితో పాటు, భారతీయ సంబంధాలను బలోపేతం చేయడం , ప్రజా రవాణాను ఉపయోగించమని ప్రజలకు సందేశం ఇవ్వడం ఈ పర్యటన ఉద్దేశమని తెలిపారు.

ఆటోల్లో అమెరికా దౌత్యవేత్తలను చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దౌత్యవేత్త మేసన్ మాట్లాడుతూ, త‌న‌కు ఆటో రిక్షాలంటే చాలా ఇష్టమ‌ట‌. తాను పాకిస్తాన్‌లో ఉన్నప్పుడు.. అక్కడ ఆటోలలో ప్రయాణించడానికి ప్రయత్నించాను. కానీ.. ఆ అవకాశం అక్కడ దొరకలేదు. నేను భారతదేశానికి వచ్చిన తర్వాత అవకాశం వచ్చింది. వెంటనే రిక్షా కొనుక్కున్నాను. ఇప్పుడు ఆటోలోనే ప్రయాణిస్తున్నాన‌ని చెప్పారు. మహిళా దౌత్యవేత్తలు ఆటో డ్రైవింగ్ అనుభవం చాలా ప్రత్యేకమైనదని చెప్పారు. చాలా కొత్త విషయాలు చూసి నేర్చుకోవాలన్నారు. అమెరికా దౌత్యవేత్త షరీన్ మాట్లాడుతూ.. నేను అమెరికా నుండి ఢిల్లీకి రావాలని అనుకున్నప్పుడు, ఆటో ఉన్న మెక్సికన్ అంబాసిడర్ గురించి విన్నాను. ఆ తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాత, N. L. మేసన్ తన ప్రయాణం కోసం ఇక్కడ ఒక ఆటోను ఉంచడం చూశాను. దీనిపై నేను ఆటోలో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను . నా కల కూడా నెరవేరింది. అని ఆనందంగా వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement