మాజీ మంత్రి, ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ వ్యవహారం.. కాంగ్రెస్‌లో కాక రేపింది. తెలంగాణ ఉద్యమంలో పోరాడిన వారందరినీ సీఎం కేసీఆర్ కక్షగట్టి బయటకు గెంటేస్తున్నారంటూ కాంగ్రెస్ లీడర్లు ఈటలకు మద్దతుగా నిలిచారు. పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, జీవన్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, దాసోజు శ్రవణ్, సంపత్ కుమార్‌తో పాటు చాలా మంది లీడర్లు ఈటెలకు మద్దతుగా మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీలోని మంత్రులు, ఎమ్మెల్యేల భూకబ్జాలు, ఆక్రమణలపై పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చి మరీ జనాలకు తెలియజేసే ప్రయత్నం చేశారు. అయితే కాంగ్రెస్ పార్టీ హుజూరాబాద్ నియోజకవర్గ ఇంఛార్జి పాడి కౌశిక్ రెడ్డి మాత్రం ఈటలకు వ్యతిరేకంగా గొంతెత్తారు. ఆయనపై ఎన్నెన్నో ఆరోపణలు చేశారు. అదే ఇప్పుడు కాంగ్రెస్‌లో చీలికకు కారణమైందన్న వాదనలు వినిపిస్తున్నాయి.
Advertisement
తాజా వార్తలు
Advertisement