గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న క్వాలిఫైయర్ మ్యాచ్‌లో రాజస్థాన్ జట్టు భారీ స్కోరు చేసింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టుకు యశస్వి జైస్వాల్ (3) రూపంలో ఆదిలోనే ఎదురు దెబ్బ తగిలింది. అలాంటి సమయంలో క్రీజులోకి వచ్చిన సంజూ శాంసన్ (47) దడదడలాడించారు. తర్వాత వచ్చిన పడిక్కల్ (28) కూడా బాగానే ఆడినప్పటికీ.. స్పీడు పెంచే క్రమంలో అవుటయ్యాడు. హెట్మెయర్ (4) నిరాశపరచగా.. ఇన్నింగ్స్ చివరి బంతికి లేని పరుగు కోసం యత్నించి బట్లర్ (89) రనౌట్ అయ్యాడు. అయితే అది నోబాల్ అని తేలడంతో అశ్విన్ క్రీజులోకి వచ్చాడు. మరుసటి బంతికి యష్ దయాళ్ వైడ్ వేశాడు. దానికి అనవసరంగా రన్ కోసం వెళ్లిన రియాన్ పరాగ్ (4) కూడా రనౌట్ అయ్యాడు. చివరి బంతికి రెండు పరుగులు తీసిన అశ్విన్ (2 నాటౌట్) జట్టుకు 188 పరుగుల స్కోరు అందించాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన రాజస్థాన్.. గుజరాత్ ముందు 189 పరుగుల టార్గెట్ నిలిపింది. భారీ బ్యాటింగ్ లైనప్ ఉన్న గుజరాత్ ఈ లక్ష్యాన్ని ఛేదిస్తుందా? లేదా అన్నది చూడాలి.
Breaking: లాస్ట్ బాల్‌కు రెండు రనౌట్లు.. గుజరాత్ లక్ష్యం 189 పరుగులు
Advertisement
తాజా వార్తలు
Advertisement