మెటా యాజమాన్యంలో ఉన్న మేస్సేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త కొత్త ఫీచర్లని తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన కొన్ని అప్డేట్స్ని వాట్సాప్ బీటీ ఇన్ఫోలో వెల్లడించింది. ఇంతకుముందు ఐఓఎస్ ఆధారిత ఐఫోన్లలో వాట్సాప్ గ్రూపుల్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు సైలెంట్‌గా గ్రూపులోంచి వెళ్లిపోతున్నారు అనే సమాచారం తెలిసేది కాదు. ఇది ఒక్క గ్రూప్ అడ్మిన్లకు మినహా మరెవరికీ కనిపించకుండా ఉండేది.
అయితే.. ‘‘పాస్ట్ పార్టిసిపెంట్స్”అనే ఫీచర్‌ని ఉపయోగించడం ద్వారా గ్రూపు మెంబర్లు అందరూ ఇప్పటికీ ఎవరెవరు లాగ్ అవుట్ అయ్యారో చూడొచ్చని వాట్సాప్ బీటీ ఇన్ఫోలో సమాచారం అందింది. ఈ ఫీచర్ ద్వార గ్రూప్ సభ్యులందరూ గత 60 రోజుల్లో గ్రూప్ నుండి ఎవరు నిష్క్రమించారో చూడొచ్చు.
అయితు.. ఇంకా ఈ ఫీచర్ డెవలప్మెంట్ ప్రక్రియలోనే ఉంది. కాబట్టి బీటా వినియోగదారులకు రిలీజ్ చేయడానికి ఇంకాస్త టైమ్ పడుతుందని వాట్సాప్ తెలిపింది. ఇదిలా ఉండగా.. వినియోగదారులు తమ స్టేటస్ అప్డేట్లపై వాయిస్ నోట్స్ ను పోస్ట్ చేయడానికి పర్మిషన్ ఇచ్చే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. స్టేటస్ అప్డేట్గా షేర్ చేసే ఇట్లాంటి వాయిస్ నోట్‌ని “వాయిస్ స్టేటస్” అని పిలువచ్చు.
ఈ ఫీచర్ స్టేటస్ ని ప్రైవసీ సెట్టింగ్స్‌లో ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే షేర్ చేసేలా డెవలప్ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వాయిస్ నోట్ స్టేటస్‌కు షేర్ చేసిన ఇతర ఫొటోలు, వీడియోల మాదిరిగానే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటుంది కాబట్టి ఎట్లాంటి భయం అక్కర్లేదని వాట్సాప్ తెలిపింది.