Friday, November 22, 2024

WhatsApp: వాట్సాప్​లో మరో రెండు కొత్త ఫీచర్లు.. త్వరలోనే బీటా యూజర్లకు అందుబాటులోకి!

మెటా యాజమాన్యంలో ఉన్న మేస్సేజింగ్​ యాప్​ వాట్సాప్​ కొత్త కొత్త ఫీచర్లని తీసుకురాబోతోంది. దీనికి సంబంధించిన కొన్ని అప్​డేట్స్​ని వాట్సాప్​ బీటీ ఇన్​ఫోలో వెల్లడించింది. ఇంతకుముందు ఐఓఎస్ ఆధారిత ఐఫోన్లలో​ వాట్సాప్​ గ్రూపుల్లో ఎవరు ఉంటున్నారు, ఎవరు సైలెంట్​గా గ్రూపులోంచి వెళ్లిపోతున్నారు అనే సమాచారం తెలిసేది కాదు. ఇది ఒక్క గ్రూప్​ అడ్మిన్లకు మినహా మరెవరికీ కనిపించకుండా ఉండేది.

అయితే.. ‘‘పాస్ట్​ పార్టిసిపెంట్స్​”అనే ఫీచర్​ని ఉపయోగించడం ద్వారా గ్రూపు మెంబర్​లు అందరూ ఇప్పటికీ ఎవరెవరు లాగ్​ అవుట్​ అయ్యారో చూడొచ్చని వాట్సాప్​ బీటీ ఇన్​ఫోలో సమాచారం అందింది. ఈ ఫీచర్​ ద్వార గ్రూప్ సభ్యులందరూ గత 60 రోజుల్లో గ్రూప్ నుండి ఎవరు నిష్క్రమించారో చూడొచ్చు.

అయితు.. ఇంకా ఈ ఫీచర్ డెవలప్​మెంట్​ ప్రక్రియలోనే ఉంది. కాబట్టి బీటా వినియోగదారులకు రిలీజ్​ చేయడానికి ఇంకాస్త టైమ్​ పడుతుందని వాట్సాప్​ తెలిపింది. ఇదిలా ఉండగా.. వినియోగదారులు తమ స్టేటస్ అప్‌డేట్‌లపై వాయిస్ నోట్స్ ను పోస్ట్ చేయడానికి పర్మిషన్​ ఇచ్చే కొత్త ఫీచర్‌పై కూడా వాట్సాప్ పనిచేస్తోంది. స్టేటస్ అప్‌డేట్‌గా షేర్ చేసే ఇట్లాంటి వాయిస్ నోట్‌ని “వాయిస్ స్టేటస్” అని పిలువచ్చు.

ఈ ఫీచర్ స్టేటస్ ని ప్రైవసీ సెట్టింగ్స్​లో ఎంచుకున్న వ్యక్తులకు మాత్రమే షేర్​ చేసేలా డెవలప్​ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ వాయిస్ నోట్ స్టేటస్‌కు షేర్ చేసిన ఇతర ఫొటోలు, వీడియోల మాదిరిగానే ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటుంది కాబట్టి ఎట్లాంటి భయం అక్కర్లేదని వాట్సాప్​ తెలిపింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement