ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో డీఆర్‌జీ జవాన్లు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు మావోయిస్టులు మరణించారు. జిల్లాలోని బెజ్జి అటవీ ప్రాంతంలో మావోయిస్టుల కోసం డీఆర్‌జీ జవాన్లు కూంబింగ్ చేపట్టారు. ఈ క్రమంలో ఆపరేషన్ పార్టీకి మావోయిస్టులు ఎదురుపడ్డారు. ఈ క్రమంలో ఇరుపక్షాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ సందర్భంగా జవాన్ల కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు.
మృతులను గొల్లపల్లి ఎస్‌ఓఎస్ కమాండర్ మద్కమ్ ఎర్రా, ఆయన భార్య పొడియం భీమ్‌గా గుర్తించారు. మద్కమ్‌పై రూ.8 లక్షలు రివార్డు ఉండగా, ఆయన సతీమణిపై రూ.3 లక్షల రివార్డు ఉన్నదని తెలిపారు. ఘటనా స్థలంలో ఆయుధాలు, పెద్దమొత్తంలో ఐఈడీలు, ఆటోమేటిక్ వెపన్స్, ఇతర ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సునీల్ శర్మ ఆధ్వర్యంలో ఆ ప్రాంతంలో మావోయిస్టుల కోసం గాలింపు కొనసాగుతున్నది.