Thursday, November 21, 2024

Danger: త్రుటిలో తప్పిన ప్రమాదం.. గాల్లోనే రాసుకుంటూ వెళ్లిన విమానాలు

టేకాఫ్ అయిన వెంటనే బెంగళూరు విమానాశ్రయం మీదుగా వెళ్తున్న రెండు ఇండిగో విమానాలు ఒకదానికొకటి పరస్పరం రాసుకుంటూ వెళ్లాయి. ఈ ఘటన జనవరి 9వ తేదీన జరిగినట్టు విమానయాన అధికారులు తెలిపారు. రాడార్ కంట్రోల్ ఆఫీసర్ల నుంచి హెచ్చరికలు చేయడంతో పెను ప్రమాదమే తప్పిందని, రెండు విమానాలు ఢీకొనడాన్ని ఆపగలిగామని ఏవియేషన్ రెగ్యులేటర్ DGCA సీనియర్ అధికారులు బుధవారం తెలిపారు. అయితే ఈ ఘటన ఏ లాగ్‌బుక్‌లోనూ రికార్డు కాలేదు. దీన్ని ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (AAI) కూడా నిర్ధారించలేదని వారు తెలిపారు.

డీజీసేఏ చీఫ్ అరుణ్ కుమార్ ఓ వార్త సంస్థతో మాట్లాడుతూ.. రెగ్యులేటర్ ఈ ఘటనపై దర్యాప్తు చేస్తోంది. దీనికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటుంది. అన్నారు. కాగా, ఈ విషయమ్మీద ఇండిగో కానీ, ఎయిర్ ఫోర్స్ అథారిటీ కానీ స్పందించలేదు. అయితే.. రెండు ఇండిగో విమానాలు — 6E455 (బెంగళూరు నుండి కోల్‌కతా), 6E246 (బెంగళూరు నుండి భువనేశ్వర్) బెంగళూరు విమానాశ్రయంలో రూల్స్ కి విరుద్ధంగా టేకాఫ్ అయ్యాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) అధికారులు చెబుతున్నారు.

ఈ రెండు విమానాలు గగనతలంలో మినిమం మాండేటరీ వర్టికల్ లేదా హారిజంటల్ డిస్టన్స్ ని దాటేటప్పుడు ఈ ఉల్లంఘన జరిగినట్టు తెలుస్తోంది. ఇవి జనవరి 9వ తేదీన ఉదయం సుమారు 5 నిమిషాల వ్యవధిలో బెంగళూరు విమానాశ్రయం నుండి బయలుదేరాయని అధికారులు పేర్కొన్నారు. అవి బయలుదేరిన తర్వాత రెండు విమానాలు ఒకదానికొకటి రాసుకుంటున్నట్టుగా వెళ్లాయి. అప్రోచ్ రాడార్ కంట్రోలర్ డైవర్జింగ్ హెడ్డింగ్ ఇచ్చింది అని అధికారులు తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసంఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement